Thellakaagitham Teaser:కోర్ట్ మూవీతో నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న యువ కథానాయకుడు హర్ష్ రోషన్ (Harsh Roshan) హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో చిత్రం ‘తెల్ల కాగితం’.. నక్షత్ర హీరోయిన్ గా నటిస్తోంది. దీపక్ , అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి నందు సవరిగాన కథ ,స్క్రీన్ ప్లే , సంభాషణలు అందించారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ టీజర్ విడుదల చేయగా.. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
చదువుకునేటప్పుడు హీరో హీరోయిన్ ప్రేమలో పడతారు. మాస్టారు.. మీ జీవితాలు తెల్ల కాగితం లాంటివి.. దీనిపై ఎర్రమచ్చ పడితే అంటూ స్టూడెంట్స్ లో ఆలోచన తెప్పిస్తాడు. అదే సమయంలో వీరి ప్రేమలో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది . ఇక తమ ప్రేమను దక్కించుకోవడానికి హీరో హీరోయిన్ పడే కష్టం ఇందులో చాలా చక్కగా చూపించారు. కథ, పాత్రలు యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. తెల్ల కాగితంపై ఎర్ర మచ్చ పడకూడదనే ఈ సినిమా స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లవ్ స్టోరీ తో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) చేతుల మీదుగా విడుదలైన తెల్ల కాగితం టీజర్ పై దిల్ రాజు తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ముఖ్యంగా టీజర్ చూశాక.. “ఇప్పుడు తెల్ల కాగితం లాంటి జీవితం ఎవరికీ ఉండదు. మనం మంచిగా ఉంటే కూడా కొందరు బ్రతకనివ్వరు. అలాంటప్పుడు మంచిగా ఉండకూడదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. ఈ టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒక ఇన్నోసెంట్ లవ్ స్టోరీ. తెల్ల కాగితంపై ఎర్ర మచ్చ పడకూడదనేది ఈ సినిమా కథ. యువతతో పాటు అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను” అంటూ దిల్ రాజు తెలిపారు.
also read:గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!
కోర్ట్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి బ్యాండ్ మేళం సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ కోర్టు మూవీ రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇకపోతే కాకినాడ శ్రీదేవి మరో సినిమాలో నటిస్తుండగా.. హర్ష్ రోషన్ మరో హీరోయిన్ తో చేస్తున్న చిత్రం తెల్ల కాగితం. ఇక టీజర్ చూస్తుంటేనే అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి కోర్ట్ మూవీ రేంజ్ హిట్ ఈ చిత్రానికి లభిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.