Fire Boltt Glitz smartwatch: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌వాచ్‌లు కేవలం టైమ్ చూసే.. పరికరాలుగా మాత్రమే కాకుండా.. ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా , హెల్త్ గాడ్జెట్లుగా మారిపోయాయి. ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా స్టైలిష్ లుక్‌లో వస్తున్న గాడ్జెట్లలో ‘ఫైర్‌బోల్ట్ గ్లిట్జ్’ ముందు వరుసలో ఉంది. ప్రముఖ బ్రాండ్ అయిన ఫైర్‌బోల్ట్ నుంచి వస్తున్న ఈ మోడల్ స్మార్ట్ వాచ్ కేవలం రూ.1,699 ధరకే లభిస్తోంది. రీగల్ గోల్డ్ స్ట్రాప్ , మెటల్ బాడీతో వస్తున్న ఈ ట్రెండీ స్మార్ట్‌వాచ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
మహిళల చేతులకు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా ఈ స్మార్ట్ వాచ్‌ను డిజైన్ చేశారు. రీగల్ గోల్డ్ స్ట్రాప్, మెటల్ బాడీ దీనికి ఒక లగ్జరీ లుక్‌ను తెచ్చిపెడతాయి. ఏ రకమైన.. ట్రెండీ లేదా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నా కూడా ఈ వాచ్ దానికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. చేతిపై పెట్టుకున్నప్పుడు బరువు తక్కువగా ఉంటూ ఇది ఎంతో సౌకర్య వంతంగా ఉంటుంది. రోజు వారీ వాడకానికి లేదా పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లే టప్పుడు ఇది ఒక చక్కటి ఫ్యాషన్ యాక్సెసరీలా పని చేస్తుంది.
ఈ ప్రైస్ రేంజ్‌లో అమొలెడ్ డిస్‌ప్లే ఉండటం నిజంగా ఒక పెద్ద విశేషం. 1.19 ఇంచుల సైజుతో ఈ డిస్‌ప్లే రంగులను చాలా స్పష్టంగా, అందంగా చూపుతుంది. దీనిలో అందించిన 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ (కారణంగా, ఎండలో బయటికి వెళ్లినప్పుడు కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. టెక్స్ట్, వాచ్ ఫేస్‌లు చాలా షార్ప్‌గా, కనిపిస్తాయి. దీని టచ్ రెస్పాన్స్ కూడా చాలా స్మూత్‌గా పని చేస్తుంది.
ఫోన్ చేతిలో లేనప్పుడు కూడా నేరుగా వాచ్ ద్వారానే మాట్లాడుకునేలా.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను ఇందులో తయారు చేసారు. ఇన్‌బిల్ట్ మైక్, స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే.. వాచ్‌ను కంట్రోల్ చేయ డానికి సైడ్ వైపు ఒక స్టైలిష్ రొటేటింగ్ క్రౌన్ ఇచ్చారు. దీన్ని తిప్పడం ద్వారా మెనూ ఆప్షన్లను మార్చడం, వాచ్ ఫేస్‌లను సెట్ చేయడం చాలా ఈజీ అవుతుంది.
Also Read: రూ.2400కే ఓవెన్ అంటే.. ఎవరైనా వదులుతారా ?
మహిళల హెల్త్ కోసం ఇందులో.. పలు రకాల హెల్త్ ట్రాకర్లను అమర్చారు. హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 (ఆక్సిజన్ లెవెల్స్) ట్రాకర్, స్లీప్ మానిటరింగ్.. వంటి ఫీచర్లు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి. అంతేకాకుండా మహిళల పీరియడ్స్ కు సంబంధించిన ప్రత్యేక ట్రాకింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం గమనార్హం. వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ వర్కౌట్లు చేసేవారికి ఎంతో సహాయపడతాయి.
రూ.1,700 బడ్జెట్‌లో ప్రీమియం మెటల్ బాడీ, అమొలెడ్ డిస్ ప్లే, కాలింగ్ ఫీచర్‌తో వస్తున్న ఈ మోడల్ మహిళలకు ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. తక్కువ ధరలో .. అందమైన లుక్ , లేటెస్ట్ ఫీచర్లు కోరు కునే వారు దీనిని నిరభ్యంతరంగా కొనొచ్చు.