Bigg Boss:బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం 7:00 గంటలకు చాలా గ్రాండ్ గా లాంచ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హౌస్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టబోతున్నారు అనే ఉత్కంఠ ఆడియన్స్ లో నెలకొంది. ఇదిలా ఉండగా మరొకవైపు బిగ్ బాస్ సీజన్ 6 లో జోడీగా పాల్గొని, తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో.. కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు మెరీనా (Marina), రోహిత్ సాహ్ని (Rohit Sahni). మెరీనా హౌస్ లో కొన్ని వారాలు ఉండి ఎలిమినేట్ కాగా.. రోహిత్ మాత్రం ఏకంగా టాప్ 5 వరకు వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు గర్భం కోసం వీరు పడిన కష్టం.. మెరీనాకి పలుమార్లు గర్భస్రావం కావడంతో ఆమె పడిన వేదన.. మాతృత్వం కోసం ఆమె కన్నీళ్లు అందరిని కంటతడి పెట్టించాయి. అయితే ఎట్టకేలకు ఈ జంట 2024లో ఒకసారి శుభవార్త చెప్పగా.. ఇప్పుడు మరో శుభవార్త చెప్పి తమ కుటుంబం ఫుల్ ఫిల్ అయింది అంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు.” కృష్ణాష్టమి సందర్భంగా ఆ కృష్ణుడు తమ జీవితాలలోకి మరో మిరాకిల్ ను పంపించారు” అంటూ రోహిత్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మేరకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తమకు మరోసారి కూతురు పుట్టింది అంటూ రోహిత్, మెరీనా తమ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా షేర్ చేసారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ తో పాటు తోటి నటీనటులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
సీరియల్స్ లో నటిస్తూ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న రోహిత్, మెరీనా సీరియల్స్ చేస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2017లో పెద్దలను ఒప్పించి పెళ్లి పేరుతో ఒకటయ్యారు. 2022లో వీళ్ళిద్దరూ బిగ్ బాస్ షోలో పాల్గొనగా 2024 నవంబర్లో వీళ్ళకి మొదటిసారి అమ్మాయి జన్మించింది. ఆమెకు తయిరా అని పేరు కూడా పెట్టారు. అంతేకాదు తమ కూతురిని 2025 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తొలిసారి అందరికీ పరిచయం చేశారు. ఇక సరిగ్గా ఏడాది తిరిగేలోపే మరోసారి తమకు కూతురు పుట్టిందనే సంగతిని ఈ జంట పంచుకున్నారు. మొత్తానికి అయితే ఇద్దరమ్మాయిలతో రోహిత్ మెరీనా కుటుంబం సంపూర్ణం అయింది.
ALSO READ:శ్రీలీల చిన్నప్పటి ‘భరతనాట్యం’ వీడియో చూశారా? ఏం టాలెంట్ గురూ!
మెరీనా తొలిసారి అమెరికా అమ్మాయి అనే సీరియల్ తో తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అయింది. అద్భుతమైన నటనకు తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. రోహిత్ విషయానికి వస్తే.. చిరు గొడవలు , మిస్టీరియస్ వంటి చిత్రాలలో నటించిన ఈయన.. అమృత వర్షిని , అభిలాష, అభిషేకం, కొంచెం కారం కొంచెం తీపి వంటి సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం ఒక ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న ‘అమ్మోరు’ అనే సీరియల్ లో హీరోగా నటిస్తున్నారు.