E-Paper
Advertisement

చిరంజీవి హెల్ప్ చేశారు.. దాసరి లేని లోటు కనిపించింది.. ఏం మాట్లాడుతున్నావ్ హేమా?

చిరంజీవి హెల్ప్ చేశారు.. దాసరి లేని లోటు కనిపించింది.. ఏం మాట్లాడుతున్నావ్ హేమా?
Advertisement

Actress Hema: నాపై రేవ్ పార్టీ అంటూ, డ్రగ్స్ అంటూ వార్తలు వచ్చినప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు వార్తలు పుట్టించేశారు. నాకు అందులో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత మాత్రం మీడియా సైడ్ నుంచి నాకు రావాల్సిన విధంగా సపోర్ట్ రాలేదంటే హేమ (Actress Hema) ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె, తన మనసులోని భావాలన్నింటినీ చెప్పేశారు. మరీ ముఖ్యంగా చిరంజీవి (Mega Star Chiranjeevi) గురించి, దాసరి నారాయణరావు (Dasri Narayana Rao) గురించి మాట్లాడుతూ.. మరోసారి ఇండస్ట్రీ పెద్ద విషయం హైలెట్ అయ్యేలా చేసింది. ఇంత జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి మీకు సపోర్ట్ ఎవరూ రాలేదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..

Also Read- ‘టాక్సిక్’ పాత్రకు సరెండర్ అయిపోయా- కియారా అద్వానీ

చిరంజీవి మనుషులను పంపించారు

Advertisement

‘‘ఎందుకు రాలేదు? మెగాస్టార్ చిరంజీవి తన మనుషుల్ని పంపించారు.. తనకేం కావాలో హెల్ప్ చేయండి అన్నారు. తర్వాత మా హీరోలు, ఇంకో ఇద్దరు ముగ్గురు హీరోలు, డైరెక్టర్లు అందరూ సపోర్ట్ చేశారు. నా ఇండస్ట్రీ నాకు సపోర్ట్ లేదు అని అనకండి.. విష్ణు బాబు కూడా సపోర్ట్ చేశారు సార్, ట్వీట్ కూడా చేశారు. తర్వాత మా అసోసియేషన్‌లో ఉంటారు కదా ఇంకా మిగతా వాళ్ళు.. మనకు నచ్చినోడు ఉండొచ్చు, నచ్చనోడు ఉండొచ్చు కదా. సో అది ఏదో జరిగిన మిస్టేక్, కానీ ఇమీడియట్‌గా సర్దుకున్నారు. ఇండస్ట్రీ సపోర్ట్ నాకు 101 శాతం వచ్చింది. రాలేదనకండి. చిరంజీవి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ మూవీలో ఇస్తానని ప్రామిస్ కూడా చేశారు. ఆయన పర్సనల్‌గా రాకపోయి ఉండొచ్చు నా దగ్గరికి, ఆయన మనుషులతో ఫోన్ చేయించి, అన్ని కనుక్కుంటూనే ఉన్నారు’’ అని చెప్పిన హేమ.. మెగాస్టార్ రీసెంట్‌గా చేసిన వ్యాఖ్యల విషయం గురించి మాట్లాడుతూ.. దాసరి ప్రస్తావన తెచ్చారు.

Also Read- ‘పెద్ది’పై నోరు జారిన ఎస్‌కెఎస్.. తప్పుగా తీసుకోవద్దు, క్షమించండి అంటూ వివరణ!

మళ్లీ దాసరి ప్రస్తావన ఎందుకు?

Advertisement

‘‘ఆంధ్రాలో అవార్డ్స్ ఇచ్చి చాలా రోజులు అయిపోయిందండి. ఆంధ్రాలో సినిమాలు తీస్తే మేము సబ్సిడీ ఇస్తామనో, లేకపోతే ఇంకొకటనో ఇండస్ట్రీని పిలిస్తే ఆంధ్రాలో ఎందుకు చేయరండి? మేమందరం అక్కడికి వెళ్ళడానికి కూడా రెడీగానే ఉన్నామండి. అది మాదే.. ఇది మాదే.. రెండు రాష్ట్రాలు మావేనండి. చిరంజీవి అన్న ఒక మంచి మాట ఏంటంటే.. ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయండి, ఇప్పుడు రెండు స్టేట్స్ అయిపోయినాయి కదా, ఆ స్టేట్‌లో కూడా మమ్మల్ని గౌరవిస్తే బాగుంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పారు. దాన్ని కూడా చిలువలు పలువలు చేసేసి, ఇష్టం వచ్చినట్టు థంబ్‌నైల్స్ పెట్టేసి మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలోనే దాసరి వంటి వారు ఉంటే బాగుండేది అనిపిస్తుంది’’ అని హేమ అనడంతో.. మరోసారి అందరినీ కన్ఫ్యూజ్ చేశారు. ఇండస్ట్రీ నుంచి పెద్దగా చిరంజీవి సపోర్ట్ చేశారని చెబుతూనే, మళ్లీ దాసరి ఉంటే బాగుండేది, పెద్దరికంగా ఉండేది అనడంతో.. అసలు హేమ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Also Read- ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి అన్నదాంట్లో తప్పేముంది?- నటి హేమ

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×