E-Paper
Advertisement

‘పెద్ది’పై నోరు జారిన ఎస్‌కెఎస్.. తప్పుగా తీసుకోవద్దు, క్షమించండి అంటూ వివరణ!

‘పెద్ది’పై నోరు జారిన ఎస్‌కెఎస్.. తప్పుగా తీసుకోవద్దు, క్షమించండి అంటూ వివరణ!
Advertisement

SKN: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘పెద్ది’ (Peddi) సినిమా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒకసారి వాయిదా పడి, ఏప్రిల్ 30కి వెళ్లిపోయిన ఈ మూవీ, ఆ తేదీకి కూడా రాదనేలా వార్తలు మొదలయ్యాయి. జూన్‌లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందనేలా వార్తలు వైరల్ అవుతున్న సమయంలో.. నిర్మాత ఎస్‌కెఎన్ (Producer SKN) తాజాగా జరిగిన ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chenni Love Story) సాంగ్ లాంచ్ కార్యక్రమంలో సడెన్‌గా నోరు జారారు. ‘‘మా సినిమాను జూన్ 26 అనుకున్నాం కానీ ఆ సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా వస్తోందని ఇప్పుడే తెలిసింది. కాబట్టి, మా సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తాం’’ అని అన్నారు. వాస్తవానికి ‘పెద్ది’ టీమ్ ఎక్కడా సినిమా వాయిదా పడినట్లుగా ప్రకటించలేదు. ఇంతలో ఈయన నోరు జారారు. వెంటనే తన తప్పు తెలుసుకుని, సోషల్ మీడియా వేదికగా ‘క్షమించండి’ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో..

Also Read- ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా కొంత చూసి.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా!- సాయి రాజేష్

అసలు విషయం అప్పుడు తెలిసింది

Advertisement

‘‘ఇప్పుడే ‘చెన్నై లవ్ స్టోరీ’ ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయడం జరిగింది. ఒక చిన్న మిస్ కమ్యూనికేషన్.. అందరూ రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడుగుతుంటే, మా సాయి రాజేష్ (రైటర్ అండ్ కో-ప్రొడ్యూసర్)ని ఎప్పుడు రిలీజ్ చేద్దాం అని అడిగాను. ఆయన ‘ఇప్పుడే ట్వీట్స్ చూస్తున్నాను, జూన్ 25న పెద్ది రిలీజ్ అని ఏదో డేట్ వైరల్ అవుతుంది, వాళ్ళు అనౌన్స్ చేసే వరకు నువ్వు ఏ రిలీజ్ డేట్ చెప్పకు’ అని అంటే.. నేను ఆ జనం అరుపుల్లో ‘ఒకవేళ పెద్ది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారేమో, జూన్ 26న అనుకున్నాం కానీ, ఆ సినిమా ఉందనుకుని.. మా సినిమా రిలీజ్ అవ్వడం లేదండి’ అని చెప్పడం జరిగింది. కార్యక్రమం అయిపోయి, కిందకు దిగిన తర్వాత నాకు అసలు విషయం తెలిసింది. అదేంటంటే..

Also Read- స్విఫ్ట్, ఆల్టో కార్లు మాత్రమే తెలిసిన నాకు.. బెంజ్ కారు కొనే రేంజ్‌కి తీసుకెళ్లారు- SKN

మిస్ కమ్యూనికేషన్‌కి సారీ..

Advertisement

ఇంకా ‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఎవరూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. అది చేసేవరకు మనం ఏదీ కన్ఫర్మ్ చేయొద్దు అని ఆయన చెప్పిన మాటల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అందుకే ఏదో డేట్ చెప్పడం, అది తప్పుగా కన్వే అయ్యి ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ నేనేదో చెప్పినట్టుగా టాక్ నడుస్తుంది. ఇందుకుగానూ క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎవరూ అన్యధా భావించవద్దు. నా ఉద్దేశం ఏంటంటే.. ఏ పెద్ద సినిమా రిలీజ్ లేని టైమ్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ’ విడుదల అవ్వాలని. అలాగే ‘పెద్ది’ సినిమా ఏ తేదీన విడుదలైనా పెద్ద విజయం సాధిస్తుంది. మేకర్స్ స్వయంగా ఆ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. సో, నా మాటలను తప్పుగా తీసుకోవద్దు. ఈ మిస్ కమ్యూనికేషన్‌కి ఐ యామ్ వెరీ సారీ..’’ అని ఎస్‌కెఎన్ ఈ వీడియోలో వివరణ ఇచ్చారు.

Also Read- రవితేజ ‘ఇరుముడి’పై సంగీత దర్శకుడి మాటలు వింటే.. థియేటర్స్‌లో పడిపూజే!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×