E-Paper
Advertisement

‘టాక్సిక్’ పాత్రకు సరెండర్ అయిపోయా- కియారా అద్వానీ

‘టాక్సిక్’ పాత్రకు సరెండర్ అయిపోయా- కియారా అద్వానీ
Advertisement

Kiara Advani: 2026లో ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న భారీ చిత్రాల్లో రాకింగ్ స్టార్ యష్ (Rocking Star Yash) హీరోగా నటిస్తోన్న‌ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీటేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్’ (Toxic: A Fairytale for Grown-Ups) కూడా ఒక‌టి. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా మార్చి 19న విడుదల కావాల్సి ఉంది. కానీ, సడెన్‌గా మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా.. ఈ సినిమాను జూన్‌కి వాయిదా వేశారు. ఈ మూవీని కన్నడ, ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో షూటింగ్ చేయగా.. హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలో డబ్బింగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని 4 జూన్, 2026న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- ‘పెద్ది’పై నోరు జారిన ఎస్‌కెఎస్.. తప్పుగా తీసుకోవద్దు, క్షమించండి అంటూ వివరణ!

సరెండర్ అయిపోయా

Advertisement

ఈ వీడియోలో కియారా అద్వానీ ఈ సబ్జెక్ట్‌కు ఫిదా అయినట్లుగా చెబుతున్నారు. ఈ మూవీ నాడియా (Nadia) పాత్ర‌లో హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య వదిలిన ఆమె ఫ‌స్ట్ లుక్‌ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ పరంగా స్లో అయిన ఈ చిత్రం.. ఇప్పుడు కియారా మాటలతో ఒక్కసారిగా మళ్లీ వార్తలలో నిలుస్తోంది. ఇంతకీ కియారా ఏం చెప్పిందంటే.. ‘‘నేను ఇప్పటివరకు చదివిన వాటిలో, చేసిన వాటిలో ఇది చాలా విలక్షణమైన క్యారెక్టర్ ఆర్క్ అని నేను భావిస్తున్నాను. నా పాత్ర పేరు నాడియా. మా డైరెక్టర్ గీతూ (గీతూ మోహన్‌దాస్), ఈ పాత్రను రాసిన విధానం, దానికి ఇచ్చిన ఆర్క్ నన్ను బాగా ఎగ్జైట్ చేశాయి. నా కెరీర్‌లో నేను కూడా ఒక కొత్త ఛాలెంజ్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న సమయంలోనే ఈ పాత్ర నా దగ్గరికి వచ్చింది. నేను ఈ పాత్రలోకి ఎలా ఒదిగిపోతాను, ఈ రోల్‌తో ఏం చేయబోతున్నాను అనే దాని గురించి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. పూర్తిగా ఆ పాత్రకు, డైరెక్టర్ విజన్‌కు నేను సరెండర్ అయిపోయాను’’ అని కియారా చెప్పుకొచ్చింది.

Also Read- ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా కొంత చూసి.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా!- సాయి రాజేష్

ఎప్పుడూ లేని విధంగా..

Advertisement

ఆమె ఈ విషయం చెప్పినప్పటి నుంచి, సినిమా కోసం వేచి చూసే వారి సంఖ్య ఇంకా ఇంకా పెరుగుతోంది. వాస్తవానికి బాలీవుడ్ మినహా, దక్షిణాదిలో చేసిన సినిమాల గురించి కియారా ఇలా ఎప్పుడూ చెప్పలేదు. తెలుగులో కూడా ఆమె రెండు సినిమాలు చేశారు. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాలలో నటించినప్పటికీ, ఎప్పుడూ ఇంత స్పెషల్‌గా వీడియోలలో మాట్లాడలేదు. అసలు ‘టాక్సిక్‌’ టీజర్ వచ్చినప్పటి నుంచి, ఈ సినిమాను చూసే కోణమే మారిపోయింది. బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి మరోసారి రాకింగ్ స్టార్ సిద్ధమవుతున్నాడనే ఫీల్‌ని జస్ట్ టీజర్‌‌తోనే యూనిట్ ఇచ్చిపడేశారు. చూద్దాం మరి.. జూన్ 4న బాక్సాఫీస్ వద్ద సునామీ ఎలా ఉంటుందో?

Also Read- ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి అన్నదాంట్లో తప్పేముంది?- నటి హేమ

Related News

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

Big Stories

Advertisement
×