E-Paper
Advertisement

‘పెద్ది వర్సెస్ టాక్సిక్’.. సోలో రిలీజ్ అనుకుంటే ఇలా అయిందేంటి?

‘పెద్ది వర్సెస్ టాక్సిక్’.. సోలో రిలీజ్ అనుకుంటే ఇలా అయిందేంటి?
Advertisement

Peddi vs Toxic: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా, ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని మార్చి 27న రిలీజ్ అని మొదట్లో ప్రకటించారు. ఆ తర్వాత సంభవించిన కొన్ని సంఘటనలతో షూటింగ్ డిలే కావడంతో ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. ఈ మధ్య విడుదలవుతున్న పోస్టర్, గ్లింప్స్ అన్నింటిపై ఏప్రిల్ 30 అనే చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా జూన్‌కి ఈ సినిమా వాయిదా పడినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మేకర్స్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, వాయిదా పడటం మాత్రం పక్కా అనేలా టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఏప్రిల్ 30న వస్తుందని, ఆ టైమ్‌లో రావాల్సిన సినిమాలన్నీ వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ‘పెద్ది’నే మరోసారి వాయిదా పడినట్లుగా టాక్ రావడంతో.. మరోసారి రిలీజ్ డేట్స్ విషయంలో గందరగోళం నెలకొంది.

Also Read- చిరంజీవి హెల్ప్ చేశారు.. దాసరి లేని లోటు కనిపించింది.. ఏం మాట్లాడుతున్నావ్ హేమా?

‘టాక్సిక్ వర్సెస్ పెద్ది’ తప్పదా?

Advertisement

ఇదిలా ఉంటే, జూన్‌లో మరో పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా రాకింగ్ స్టార్ యష్ (Rocking Star Yash) హీరోగా నటిస్తోన్న‌ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీటేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్’ రిలీజ్ కూడా ఉంది. ఈ సినిమా కూడా మార్చి 19న విడుదల కావాల్సిన సినిమానే. మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు ‘పెద్ది’ రిలీజ్‌కు సంబంధించి జూన్ 5న విడుదల అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా రెండు పెద్ద సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలైతే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌పై ఆ ప్రభావం పడే అవకాశం ఉందనే విషయం తెలియంది కాదు. కాబట్టి, ఈ రెండు సినిమాలు (Peddi vs Toxic) ఒక్క రోజు గ్యాప్‌లో విడుదలవుతాయా? అంటే చెప్పడం మాత్రం కష్టమే. ఆ లెక్కన చూస్తే.. ‘పెద్ది’ విడుదల జూన్ ఎండింగ్‌కు వెళ్లిపోయే అవకాశం ఉంది. జూన్ ఎండింగ్ అంటే దాదాపు స్కూల్స్ ఓపెన్ చేసే టైమ్, వర్షాకాలం మంచి పీక్‌లో ఉంటుంది. ఇది మరింత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

Also Read- ‘పెద్ది’పై నోరు జారిన ఎస్‌కెఎస్.. తప్పుగా తీసుకోవద్దు, క్షమించండి అంటూ వివరణ!

ఏమైనా కుట్ర జరుగుతుందా?

Advertisement

మొదటి నుంచి సోలో రిలీజ్ కోసం ఇలాంటి పెద్ద సినిమాలన్నీ ముందే రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తుంటాయి. ఆ రిలీజ్ డేట్‌కి రాలేకపోతే మాత్రం ఇలానే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడనుకుంటున్న ఏప్రిల్ 30న వస్తే ఏ గోలా ఉండదు. అసలు ఈ సినిమా షూటింగ్ పరిస్థితి ఏంటనేది మేకర్స్ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ఇలా చేసే ‘గేమ్ చేంజర్’ని అటు, ఇటు కాకుండా చేశారు. ఇప్పుడు ‘పెద్ది’ సినిమాకు కూడా ఏవో కుట్రలు జరుగుతున్నాయనేలా.. అప్పుడే ఫ్యాన్స్ కూడా కామెంట్స్ స్టార్ట్ చేశారు. మరోవైపు.. ‘పెద్ది’ వాయిదా పడితే మాత్రం ఓటీటీ డీల్ విషయంలో కూడా పెద్ద తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. మరి, వీటన్నింటికీ సమాధానం రావాలంటే మాత్రం మేకర్స్‌లో ఎవరు ఒకరు స్పందించాల్సిందే. దర్శకుడు బుచ్చిబాబు మాత్రం.. ఏప్రిల్ 30 అన్నట్లుగానే మొదటి నుంచి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. అందుకే చరణ్‌కి ప్రమాదం జరిగినా, వెంటనే షూట్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యేలా చేశారు. చూద్దాం మరి.. అధికారిక ప్రకటన ఏ విధంగా వస్తుందో?

Also Read- ‘టాక్సిక్’ పాత్రకు సరెండర్ అయిపోయా- కియారా అద్వానీ

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×