Tollywood:ఏ సిని ఇండస్ట్రీలో నైనా సరే.. ఒక సినిమా షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత అనుకోకుండా కొన్ని కారణాల చేత హీరో హీరోయిన్స్ ని మార్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ మరి కొన్ని సందర్భాలలో మాత్రం మొదట ఒక సినిమా టైటిల్ ని అనౌన్స్మెంట్ చేసి.. ఆ తర్వాత విడుదలకు సిద్ధమవుతున్న చివరి క్షణంలో టైటిల్స్ మార్చుకొని.. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలా ఇప్పుడు టాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా టైటిల్స్ మార్చుకొని మంచి విజయాలను అందుకున్న సినిమాల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. వాటి గురించి చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి – ఠాగూర్:
చిరంజీవికి జోడిగా శ్రియా శరణ్, జ్యోతిక నటించగా.. ఈ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన చిత్రం ఠాగూర్.ఈ సినిమాకి మొదట “రమణ” అనే టైటిల్ పెట్టాలనుకున్నారట. కానీ చివరి క్షణంలో టైటిల్ మార్చి.. ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు చిరంజీవి.
పవన్ కళ్యాణ్ కెరియర్ ని మార్చేసిన చిత్రం ఖుషి. ఈ సినిమాకి డైరెక్టర్గా ఎస్ జె సూర్య పనిచేశారు. ఇందులో భూమిక హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి మొదట “చెప్పాలని ఉంది” అనే టైటిల్ అనుకున్నారట కానీ ఆఖరికి ఈ సినిమాకి ఖుషి అని టైటిల్ పెట్టి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు.
డైరెక్టర్ గుణశేఖర్ – మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో భూమిక హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి మొదట ‘అతడే ఆమె సైన్యం’ అనే టైటిల్ ని పెట్టాలనుకున్నారు. చివరికి ఒక్కడు అని టైటిల్ మార్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు.
డైరెక్టర్ కొరటాల శివ, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క శెట్టి నటించింది. ఈ సినిమాకి మొదట “వారధి” అనే టైటిల్ అనుకున్నారు.
డైరెక్టర్ సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమాకి మొదట “ఆర్య లాంటి ఫ్రెండ్ ఉంటే” అనే టైటిల్ పెట్టాలనుకున్నారు.
డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన చిత్రం మగధీర. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి మొదట “డేగ” అనే టైటిల్ ని పెట్టాలనుకున్నారు.
డైరెక్టర్ హరీష్ శంకర్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి మొదట “వాల్మీకి” అనే టైటిల్ని అనుకున్నారు.
ALSO READ:Killer Movie Teaser: కిల్లర్ టీజర్ రిలీజ్.. విభిన్న షేడ్స్ అరాచకం సృష్టించిన జ్యోతి పూర్వాజ్!
ఈ చిత్రాలతో పాటు ఇటీవల కలర్ ఫోటో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుహాస్ నటించిన చిత్రం హే బల్‌వంత్. సుహాస్ హీరోగా డైరెక్టర్ గోపి అచ్చర కాంబినేషన్ లో ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమాకి మొదట హే భగవాన్ అని టైటిల్ పెట్టారు. అయితే విడుదలకు రెండు రోజుల ముందు హే బల్‌వంత్ టైటిల్ మార్చి ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు.
మొత్తానికైతే ఇలా టైటిల్ మొదట ఒకటి అనుకొని.. ఆఖరికి మరో టైటిల్ మార్చినా.. ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.