E-Paper
Advertisement

Cheapest Electric Cars: టాటా To ఎంజీ.. ఇండియాలో చౌకైన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Cheapest Electric Cars: టాటా To ఎంజీ.. ఇండియాలో చౌకైన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Budget Friendly EVs 2026: ఇండియన్ మార్కెట్ లోకి రోజు రోజు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. లగ్జరీ కార్ల నుంచి చౌకైన కార్ల వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. లగ్జరీ ఈవీల గురించి కాసేపు పక్కన పెడితే, ప్రస్తుతం భారత్ లో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటిలో టాటా నుంచి ఎంజీ వరకు పలు కంపెనీలకు చెందిన మోడల్స్ ఉన్నాయి.

భారత్ లో 5 చౌకైన ఎలక్ట్రిక్ కార్లు  

⦿ MG కామెట్ EV: ఈ కారు ధర సుమారు రూ.6.24 లక్షల నుంచి రూ. 9.98 లక్షల వరకు ఉంటుంది. ఇది దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు. 2 డోర్ల మైక్రో EVగా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. నగర ప్రయాణాలకు, పార్కింగ్‌ కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకే ఛార్జ్ తో సుమారు 230 కి.మీ నుంచి 250 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Advertisement

⦿ టాటా టియాగో EV: ఈ కారు ధర సుమారు రూ. 7.5 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు 4 డోర్ల హ్యాచ్‌ బ్యాక్ గా అందుబాటులోకి వచ్చింది. ఇది రోజువారీ అవసరాలకు అత్యంత ప్రాచుర్యం పొందిన బడ్జెట్ EVగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కారు ఒకే ఛార్జ్ తో సుమారు 250 – 315 కి.మీ రేంజ్ ను అందిస్తుంది.

⦿ టాటా పంచ్ EV: ఈ కారు ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.44 లక్షల వరకు ఉంటుంది. ఇది చౌకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ SUV. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగి ఉంది. ఇది మంచి ఫీచర్లు, లాంగ్ రేంజ్ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఒకే ఛార్జ్ తో ఈ కారు సుమారు 300 కి.మీ నుంచి 400 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.

Advertisement

⦿ సిట్రోయెన్ eC3: ఈ కారు ధర సుమారు రూ. 9.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుంది. ఇది హ్యాచ్‌ బ్యాక్ గా అందుబాటులోకి వచ్చింది. విశాలమైన ఇంటీరియర్, బాక్సీ డిజైన్‌తో వస్తుంది. ఈ కారు ఒకే ఛార్జ్ తో సుమారు 320 కి.మీ వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

Read Also: టాటా పంచ్ EV, టాటా పంచ్ పెట్రోల్, వీటిలో ఏది కొంటే బెస్ట్?

⦿ టాటా టిగోర్ EV: ఈ ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ. 12.49 లక్షల నుంచి రూ. 13.75 లక్షల వరకు ఉంటుంది. బడ్జెట్ ధరలో లభించే ఒకే ఒక్క సెడాన్ EV ఇదే. పెద్ద బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఒకే ఛార్జ్ తో ఈ కారు ఏకంగా  315 కి.మీ వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

Read Also: లాంచ్ కు రెడీ అవుతున్న మెర్సిడెస్ బేబీ జి-క్లాస్, మార్కెట్ లోకి వచ్చేది ఎప్పుడంటే?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×