E-Paper
Advertisement

Sand Mining: అనుమతుల పేరుతో చీకట్లో అక్రమ తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Sand Mining: అనుమతుల పేరుతో చీకట్లో అక్రమ తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు
Advertisement

Sand Mining: అనుమతి ఉంటే.. రాత్రి మాత్రమే తోవ్వకాలు ఎందుకు…?
-ప్రభుత్వ భూముల్లోనే ఎర్ర మట్టి తోవ్వకాలు
-భూగర్భ వనరులు నాశనం చేస్తున్నా వైనం
-అధికారులు అంతర్గతంగా అక్రమార్కులకు మద్దతు
-చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్.

రంగారెడ్డి బ్యూరో స్వేచ్ఛ: ప్రభుత్వమనే పేరు కనిపిస్తే రాజకీయ నాయకులకు, వ్యాపారస్థులకు లోకువగా కనిపిస్తుంది. అదే సామాన్యుడు ఆ మాట విన్నా, ఆ పదం కనిపించినా గౌరవంగా స్వీకరిస్తారు. కానీ ప్రభుత్వాని చులకన భావంతో, రాజకీయం, ఆర్థికంగా ప్రభావితం చేసి స్వార్థం ప్రయోజనాల కోసం వాడుకుంటారు. వీళ్లకు అదే స్థాయిలో కొంతమంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సహకరిస్తూ ప్రభుత్వ విధానాలకు తూట్లు పొడుస్తున్నారు. ఈ వ్యవహారం రంగారెడ్డి జిల్లాలో ఎప్పుడైనా విచ్చలవిడిగా పని చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహారిస్తే భూగర్భ వనరులు, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీల్లో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇవేమీ తమకేమి పట్టనట్లు వ్యవహారిచడంలో జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది. జిల్లాలో ఒక్క చోట కాదు.. నలుమూలల ప్రభుత్వ స్థలంలో ఎర్ర మట్టి ని అనుమతి లేకుండా తోవ్వకాలు చేస్తున్నారు.

రాత్రి సమయమే అక్రమార్కులకు అనుకూలం..

Advertisement

మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూముల నుంచి అనుమతులు లేకుండానే మట్టి తరలింపు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత శాఖల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండటంతో కొందరు వ్యాపారులు స్వేచ్ఛగా తవ్వకాలు చేపట్టి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. దామరగిద్ద రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 153లో ఉన్న ప్రభుత్వ భూమిలో జేసీబీల సహాయంతో పెద్ద ఎత్తున మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అక్కడ తవ్విన మట్టిని బస్తేపూర్ శివారులో ఇటీవల ఏర్పాటు చేసిన ఫామ్‌ల్యాండ్ వెంచర్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ కార్యకలాపాలు ఎక్కువగా రాత్రి వేళల్లో, ముఖ్యంగా అధికారులు అందుబాటులో ఉండని శని, ఆదివారాల్లో వేగంగా సాగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. నియంత్రణ లేకుండా జరుగుతున్న తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు తవ్విన ప్రదేశాల్లో ఏర్పడిన గుంతలు ప్రమాదాలకు దారితీసే పరిస్థితి నెలకొన్నదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు పరిమిత తనిఖీలకు పరిమితమవుతున్నారని, పట్టుబడిన వాహనాలను కూడా రాజకీయ ఒత్తిళ్లతో విడిచిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుని అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Also Read: Uttam Kumar Reddy: దేవాదుల ప్రాజెక్టు పూర్తి పై.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వ పనులకే అనుమతి అవసరం

Advertisement

ప్రభుత్వ అవసరాల కోసం మట్టి వినియోగించాలన్నా సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలు తమకు వర్తించవన్నట్లుగా కొందరు వ్యవహరిస్తూ మట్టి మాఫియాగా వ్యవస్థీకృతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తహసీల్దార్ కృష్ణయ్య

ప్రభుత్వ భూముల నుంచి మట్టి, మోరంను అనుమతి లేకుండా తరలించకుండా కట్టడి చర్యలు చేపడతామని తహసీల్దార్ కృష్ణయ్య తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అక్రమంగా తరలించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read: Kalvakuntla Kavitha: నాగర్ కర్నూల్ జిల్లాలో.. పసిబిడ్డ మృతి పై స్పందించిన కల్వకుంట్ల కవిత..!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×