E-Paper
Advertisement

Killer Movie Teaser: కిల్లర్ టీజర్ రిలీజ్.. విభిన్న షేడ్స్ అరాచకం సృష్టించిన జ్యోతి పూర్వాజ్!

Killer Movie Teaser: కిల్లర్ టీజర్ రిలీజ్.. విభిన్న షేడ్స్ అరాచకం సృష్టించిన జ్యోతి పూర్వాజ్!
Advertisement

Killer Movie Teaser:జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వాజ్ (Jyothi Poorvaj)గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు.. జగతి క్యారెక్టర్ తో ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో తన అద్భుతమైన నటనతో హోమ్లీ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఈమె.. ఇటు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు..ఒకవైపు గ్లామర్ వలకబోస్తూ అభిమానులలో హీట్ పుట్టిస్తూనే.. మరోవైపు ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో మంట రాజేస్తూ ఉంటుంది. అలాంటి ఈమె నటిగా తన భర్త , ప్రముఖ దర్శకుడు, నిర్మాత సుకూ పూర్వాజ్ జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్.

ఏ.పద్మనాభ రెడ్డితో కలిసి సుకూ పూర్వాజ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు కూడా.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా. విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆదివారం నిర్వహించిన ఒక ఈవెంట్లో ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా.. ఇందులోని జ్యోతి పూర్వాజ్ మల్టీ షేడ్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అటు అందంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇందులో విభిన్నమైన పాత్రలు పోషించి అదరగొట్టేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కిల్లర్ టీజర్ ఎలా ఉందంటే?

Advertisement

ఇక టీజర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. జ్యోతి పూర్వాజ్ తన కెరియర్ లోనే తొలిసారి అత్యంత పవర్ఫుల్ బోల్డ్ పాత్రలో నటించినట్లు టీజర్ చూస్తే స్పష్టం అవుతుంది. ఇందులో ఈమె ఒకే పాత్రకు పరిమితం కాకుండా గూడచారి, టెర్రరిస్ట్, పోలీస్ ఆఫీసర్ , లవర్, రక్త పిశాచి ఇలా దాదాపు 5 విభిన్నమైన పాత్రలలో కనిపించి అదరగొట్టేసింది. ప్రతి పాత్రలో కూడా గూస్బంస్ వచ్చేలా ఆమె వేరియేషన్స్ అందరిని ఆశ్చర్యపరిచాయి. టీజర్ లో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా గ్లామర్ తో కూడా మత్తెక్కించింది.

ఇకపోతే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో పాటు ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాను రూపొందించినట్లు టీజర్ స్పష్టం చేసింది. మరి భారీ అంచనాల మధ్య త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. ఏదిఏమైనా ఎప్పుడూ గ్లామర్ డాల్ గా దర్శనం ఇచ్చే జ్యోతి పూర్వాజ్ ఇలా సడన్గా ఇన్ని వేరియేషన్స్ చూపిస్తూ అదరగొట్టేసిందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి నటిగా తన ప్రయాణం ఏ దిశకు అడుగులు వేయిస్తుందో చూడాలి.

Advertisement

ALSO READ:MSG Movie: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి మన శంకర వరప్రసాద్ గారు.. డేట్ లాక్!

భార్యాభర్తల ప్రయత్నం ఫలిస్తుందా?

ఇకపోతే ఈ చిత్రానికి సుకూ పూర్వాజ్ దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు ఇదే సినిమాలో ఆయన నటించారు కూడా ..పైగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటిస్తూనే.. తన భార్య జ్యోతితో యాక్షన్ కూడా చేయించారు. మరి ఈ భార్యాభర్తల ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో తెలియాలి అంటే ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

మొత్తానికి అయితే వీరిద్దరూ గట్టిగానే సినిమా ప్లాన్ చేశారు. విభిన్నమైన పాత్రలతో అన్ని వేరియేషన్స్ ఒకే సినిమాలో చూపించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×