E-Paper
Advertisement

Sahibzada Farhan: అల్లా మీద ఒట్టు.. ఆసియా క‌ప్ లో లాగానే టీమిండియాను చిత్తుగా ఓడిస్తాం

Sahibzada Farhan: అల్లా మీద ఒట్టు.. ఆసియా క‌ప్ లో లాగానే టీమిండియాను చిత్తుగా ఓడిస్తాం

Sahibzada Farhan: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India Vs Pakistan) మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అసలు ఈ టోర్నమెంట్ ప్రారంభానికి అంటే ముందు ఈ మ్యాచ్ జరగడంపై సందిగ్ధత నెలకొంది. కానీ ఐసీసీ గట్టిగా ఇచ్చి పాడేయడంతో పాకిస్తాన్ దిగివచ్చింది. ఇండియాతో మ్యాచ్ ఆడతామని మోకాళ్లపై కూర్చుంది పాకిస్తాన్. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉన్న నేపథ్యంలో పాక్ క్రికెటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న మ్యాచ్ లో ఇండియాను చిత్తుగా ఓడిస్తామని వెల్లడించారు. ఇది రాసి పెట్టుకోండి అంటూ సవాల్ కూడా విసిరారు. దీంతో సాహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: PAK VS USA: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై అనుమానాలు…USAపై పాకిస్తాన్ విజ‌యం, సూప‌ర్ 8లోకి ఎంట్రీ !

అల్లా మీద ఒట్టు.. ఇండియన్ ఓడిస్తాం – సాహిబ్‌జాదా ఫర్హాన్

ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొలంబో వేదికగా మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాను చిత్తు చిత్తుగా ఓడించి… వాళ్లకు కాలరాత్రిని మిగిల్చుతానని శపథం చేశారు సాహిబ్‌జాదా ఫర్హాన్. నిన్న ఇండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan ), వసీం అక్రమ్ ( Wasim Akram) మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

ఫిబ్రవరి 15వ తేదీన ఏం చేయబోతున్నారు.. ఆ రోజు ఇండియన్ ఎలా ఎదుర్కొంటారు అంటూ వ‌సీం అక్ర‌మ్ ప్రశ్నించాడు. దీనికి వెంటనే సాహిబ్‌జాదా ఫర్హాన్ సమాధానం కూడా ఇచ్చారు. ఆసియా కప్ లో ఎలాగైతే ఇండియన్ ఓడించామో ఇప్పుడు కూడా అలాగే ఓడిస్తామని హాట్ కామెంట్స్‌ చేశారు. ఇండియాను ఓడించే వరకు నిద్రపోయేది లేదని తెలిపారు. అయితే ఆసియా కప్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ లు జరిగితే… మూడింటిలో కూడా పాకిస్తాన్ ఓడిపోయింది. ఈ విషయాన్ని గ్రహించకుండా.. ఆసియా కప్ లో ఇండియాను ఓడించిన తరహాలోనే… ఇప్పుడు ఓడిస్తామని చెప్పడం ఇప్పుడు హాస్యాస్పదమైంది. దీనిపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఓడిపోయిన మ్యాచ్ ను గెలిచామని సాహిబ్‌జాదా ఫర్హాన్ గాడు చెప్పుకుంటున్నాడని ఫైర్ అవుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ముందుగా ఇండియాతో మ్యాచ్ ఆడబోమ‌ని పాకిస్తాన్ ఓవ‌రాక్ష‌న్ చేసింది. కానీ చివ‌ర‌కు పాకిస్తాన్ ఆడాల్సి వ‌చ్చింది.

Also Read: Bhanuka Rajapaksa: ఇండియ‌న్‌ బ్యాట్ల‌లో రబ్బ‌ర్లు, అందుకే భ‌యంక‌రంగా ఆడుతున్నారు..విషం క‌క్కిన శ్రీలంక ప్లేయ‌ర్‌

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×