E-Paper
Advertisement

Vijay Sai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్.. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు

Vijay Sai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్.. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు
Advertisement

Vijay Sai Reddy: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న విచారణకు రావాలంటూ ఈడీ నోటీసుల్లో పేర్కొంది. లిక్కర్ స్కాం కేసులో పెద్దఎత్తున హవాలా జరిగిందన్న ఆరోపణలున్నాయి. లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది.

అక్రమ లావాదేవీల ఆరోపణలు

ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ కేసులో భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీ అమలలో పెద్దఎత్తున హవాలా లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కీలక పాత్ర పోషించారని ఈడీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.

రాజకీయ వర్గాల్లో చర్చ

Advertisement

విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. లిక్కర్ కేసులో విజయసాయి రెడ్డి పాత్రపై వివరణ ఇవ్వాలని ఈడీ నోటీసుల్లో కోరినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. త్వరలో ఈడీ చర్యలకు రెడీ అవుతుందని తెలుస్తోంది.

Also Read: లిక్కర్ కేసు విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ రాజకీయ వ‌ర్గాల్లో టెన్షన్ 

ఈ నెల 22న విచారణ

Advertisement

ఈ నెల 22న దిల్లీ లేదా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని విజయసాయి రెడ్డికి ఈడీ సూచించింది. వైసీపీ హయాంలో 2019-2024 మధ్య ఏపీలో అమలు చేసిన లిక్కర్ పాలసీతో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మద్యం సరఫరాదారులు, డిస్టలరీల నుంచి భారీ ఎత్తున ముడుపులు పలువురి నేతలకు అందాయని, ఆ నగదును హవాలా రూపంలో బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Related News

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

Big Stories

Advertisement
×