E-Paper
Advertisement

MSGV Collections : బాక్సాఫీస్ వద్ద ‘శంకర వరప్రసాద్’ రికార్డుల మోత..500 కోట్లు రాబడుతుందా..?

MSGV Collections : బాక్సాఫీస్ వద్ద ‘శంకర వరప్రసాద్’ రికార్డుల మోత..500 కోట్లు రాబడుతుందా..?
Advertisement

MSGV Collections : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు.. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. జనవరి 12న థియేటర్లోకి వచ్చిన మూవీ వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ని అందుకున్న చిరంజీవి సినిమా రోజురోజుకీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ మూత మోగిస్తుంది. పాజిటివ్ టాక్ తో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించడంతో వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తుంది. మూడు రోజులకు గాను 160 కోట్ల వరకు వసూలు చేసిన చిత్రం నాలుగు రోజులకు 200 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తుంది. మరి ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం..

‘మనశంకర వరప్రసాద్’ 4రోజుల కలెక్షన్స్..

సంక్రాంతి బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు మూవీ రోజుకు రోజుకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. చిత్రం రాబడుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ పండితులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అవుతోంది.. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు టికెట్స్ దొరకడం కష్టం అవుతుంది. నాల్గవ రోజున ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి 15 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. మొదటి నాలుగు రోజులకు గాను ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 74 కోట్ల రూపాయిల షేర్ వసూలు వచ్చాయి.. వరల్డ్ వైడ్ గా నాలుగు రోజులకు గాను దాదాపు 160 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. ఇదే లెక్కన ఈ వీకెండ్ కనక కొనసాగితే కచ్చితంగా 200 కోట్లకు పైగా వసూళ్లను అందుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే మొదటి వారంలోనే ఈ సినిమా దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నట్లే.. ఈనెల పూర్తయ్యలోగా 500 కోట్లు వసూలు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.

Advertisement

Also Read: కన్నీళ్లు పెట్టుకున్న రాజేశ్వరి..కోటిలింగంను కొట్టిన భానుమతి.. అక్షయ్ పై రాజేంద్ర ప్రశంసలు..

ఏ ఏరియాలో ఎన్నికోట్లంటే..?

ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్న ఈ మూవీ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వసూల్ చేసిందంటే..నాలుగు రోజులకు గాను ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 74 కోట్ల రూపాయిల షేర్ వసూలు వచ్చాయి.. అలాగే కర్ణాటక 7 కోట్లు, ఓవర్సీస్ నుండి 13 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.. సీడెడ్ ప్రాంతం నుండి 10 కోట్ల 75 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 9 కోట్ల 25 లక్షలు,గుంటూరు 7 కోట్లు, గోదావరి జిల్లాల్లో 13 కోట్లు, కృష్ణా జిల్లా నుండి 5 కోట్ల 46 లక్షలు వసూళ్లను అందుకుంది. మొత్తానికి మూవీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి.. మరి 500 కోట్లు వసూల్ అవుతాయేమో చూడాలి.. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే వీటి గురించి అనౌన్స్ చేసే అవకాశం ఉంది..

Related News

‘ రామాయణ’ సినిమా బిగ్ షాక్.. అక్కడ సినిమా బ్యాన్..

ఖుషీ కపూర్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ వరకు.. బాలీవుడ్‌లో పండుగ జోష్!

49 ఏళ్ల సురేఖా వాణి.. యువకుడితో క్లోజ్ వీడియోలు! నిజమెంత?

రష్మిక మందన్న నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

RC17 బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా..? సుక్కు ప్లానేంటి మావా..!

ఒకే పల్లవికి మూడు నాలుగు వెర్షన్లు.. వేటూరి టాలెంట్ ఇదే!

దాసరి నారాయణరావుతో ఆ సంఘటన.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

తల్లి చనిపోయినా షూటింగ్‌లోనే అలీ.. ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను!

Big Stories

Advertisement
×