E-Paper
Advertisement

Manchu Manoj : మంచు మనోజ్ కిడ్నాప్… వీడియో రిలీజ్ చేసిన హీరో ?

Manchu Manoj : మంచు మనోజ్ కిడ్నాప్… వీడియో రిలీజ్ చేసిన హీరో ?
Advertisement

Manchu Manoj: మంచు మనోజ్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన భైరవం, మిరాయ్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన మనోజ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారని చెప్పాలి. ప్రస్తుతం కెరియర్ పరంగా మనోజ్ ఎంతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే మనోజ్ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

మంచు మనోజ్ ను కిడ్నాప్ చేసిన డైరెక్టర్?

తాజాగా మంచు మనోజ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచు మనోజ్ కిడ్నాప్(Kidnap) అయ్యారు అంటూ ఈ వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే కిడ్నాప్ కావడం అంటే నిజంగా కిడ్నాప్ కాదండోయ్… ఓ సినిమా కోసం చిత్ర బృందం తనని బంధించినట్టు ఈ వీడియోలో మనోజ్ తెలిపారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సినిమాలలో రాజు వెడ్స్ రాంబాయి(Raju Weds Rambai) ఒకటి. ఈ సినిమా కోసం మంచు మనోజ్ వాయిస్(Manchu Manoj Voice) ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి మనోజ్ ఈ వీడియో ద్వారా తెలియజేశారు.

రాజు వెడ్స్ రాంబాయి కోసం మనోజ్..

Advertisement

తాను మూడు నాలుగు రోజులపాటు కామాఖ్య ఆలయానికి వెళ్లి అన్ని పూజలు చేయించుకుని ఇంటికి వచ్చానో లేదో వెంటనే నన్ను కిడ్నాప్ చేసి స్టూడియోకి తీసుకువచ్చారు. నన్ను కిడ్నాప్ చేసిన మెయిన్ వ్యక్తి సాయి కనిపించలేదు కానీ మిగతా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వెంటనే చెక్ రెడీ చేయండి.. లేదంటే నేను హర్ట్ అవుతాను అంటూ మనోజ్ తెలిపారు. అయితే ఈ వీడియో చాలా సరదాగా ఉందని చెప్పాలి. మనోజ్ రాజు వెడ్స్ రాంబాయి కోసం వాయిస్ ఇవ్వడంతో డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఈ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

Advertisement

ఇక రాజు వెడ్స్ రాంబాయి సినిమా విషయానికి వస్తే..వరంగల్, ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామీణ ప్రాంతాలలో జరిగిన వాస్తవిక సంఘటన ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్ రాజ్, తేజస్విక్ జంటగా నటించారు. ఇక ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల రాహుల్ మోపిదేవి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచి ఎంతో మంచి పాజిటివ్ టాక్ చేసుకొని భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రసారం అవుతుంది. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలో మంచు మనోజ్ కూడా భాగమయ్యారని తెలుస్తోంది.

Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ ఆంటోనీ రహస్య ప్రేమాయణం…అందుకే చెప్పలేదన్న నటి!

Related News

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

Big Stories

Advertisement
×