E-Paper
Advertisement

Hero Nandu: నా డౌట్స్ అతనితోనే షేర్ చేసుకుంటా.. ‘హ్రీం’ ఈవెంట్‌లో నందు!

Hero Nandu: నా డౌట్స్ అతనితోనే షేర్ చేసుకుంటా.. ‘హ్రీం’ ఈవెంట్‌లో నందు!
Advertisement

Hero Nandu: నందు.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర యాంకర్‌గా, వెండితెరపై హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, క్రికెట్ కామెంటేటర్‌గా ఇలా.. తన ప్రతిభను చాటుతున్న నందు (Nandu), ఈ మధ్య తన కెరీర్‌ను తలుచుకుని ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ‘సైక్ సిద్ధార్థ’ మూవీ వేడుకలో, తనకు సరైన గుర్తింపు రాలేదన్నట్లుగా చెబుతూ, ఎమోషనల్ అయ్యారు. ఇకపై మంచి సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తానని చెప్పారు. అలాంటి నందు, తనకి ఏ డౌట్స్ ఉన్నా.. ఏమీ ఆలోచించకుండా శివ మల్లాలతో షేర్ చేసుకుంటానని తాజాగా ‘హ్రీం’ మూవీ వేడుకలో అన్నారు. పవన్‌ తాతా, చమిందా వర్మ జంటగా నటించిన చిత్రం ‘హ్రీం’ (Hreem). శివమ్‌ మీడియా పతాకంపై సుజాత మల్లాల సమర్పించగా.. నిర్మాత శివ మల్లాల (Siva Mallala) నిర్మించారు. రాజేష్‌ రావూరి దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. సోమవారం చిత్ర హీరో పవన్‌ తాతా (Pawan Tata) పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర కార్యాలయంలో వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు ‘దండోరా’, ‘సైక్‌ సిద్ధార్థ’ చిత్రాల హీరో శ్రీనందు గెస్ట్‌గా హాజరయ్యారు.

Also Read- Ranabaali: ‘రణబాలి’ టైటిల్ గ్లింప్స్.. విజయ్ దేవరకొండ క్రేజ్‌పై డౌట్స్!

వెల్ విషర్

Advertisement

ఈ కార్యక్రమంలో నందు మాట్లాడుతూ.. ఇప్పుడే ‘హ్రీం’ మూవీ పోస్టర్స్, గ్లింప్స్‌ చూశాను. ఇందులో ఎంతో ఎక్సైట్ చేసే కంటెంట్ ఉందనిపించింది. త్వరలోనే అంతా ఈ కంటెంట్‌ను చూస్తారు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాతతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎన్నో ఏళ్లుగా మా ట్రావెల్‌ కొనసాగుతుంది. నాకు ఎప్పుడైనా, ఏ విషయంలోనైనా సందేహం వస్తే.. వెంటనే ఏం ఆలోచించకుండా శివ మల్లాల అన్నతో షేర్‌ చేసుకుంటాను. ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆయన వెల్‌ విషర్‌గా ఉన్నారు. ఈ సినిమాతో తమ కెరియర్‌లను గొప్పగా ప్లాన్‌ చేసుకుంటున్న హీరో పవన్‌, హీరోయిన్‌ డాక్టర్‌ చమిందా వర్మలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దర్శకుడు రాజేష్‌కు ఇది చక్కని అవకాశం. అందరికి ఆల్‌ ది బెస్ట్‌ అని చెప్పుకొచ్చారు.

Also Read- Mohan Babu: ది ప్యారడైజ్ కోసం కళ్ళు చెదిరే రేంజ్ లో మోహన్ బాబు రెమ్యూనరేషన్.. అంత అవసరమా?

కుటుంబ సభ్యుడు

Advertisement

హీరో పవన్‌ మాట్లాడుతూ.. నాకు ‘హ్రీం’ సినిమా ద్వారా మంచి అవకాశం అభించింది. నన్ను నమ్మి, నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌. ఈ సినిమా కంటెంట్‌ చూసిన తర్వాత అంతా నన్ను ప్రశంసిస్తారని ఆశిస్తున్నా. ఇది నాకు మెమరబుల్ బర్త్‌డే అని అన్నారు. హీరోయిన్‌ చమిందా వర్మ మాట్లాడుతూ.. నా ఫస్ట్‌ సినిమా కో స్టార్‌ పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నందు ఈ వేడుకలో పాల్గొని మా టీమ్‌ని విష్‌ చేసినందుకు ఆయనకు థ్యాంక్యూ అని అన్నారు. నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ.. నేను అడగ్గానే మా హీరో పవన్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొని మా టీమ్ అందరికీ ఎనర్జీనిచ్చిన నందుకి థ్యాంక్స్. తను ఎప్పుడూ నాతో ఒక కుటుంబ సభ్యునిలా మెలుగుతూ ఉంటాడు. ‘హ్రీం’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. పనులన్నీ ఎంతో వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

Also Read- Vishwak Sen: అనిల్ రావిపూడికి చిరు కారు గిఫ్ట్.. హర్టయిన మాస్ కా దాస్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×