Ranabaali: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ తప్పితే విజయ్ కెరీర్‌లో చెప్పుకోవడానికి సరైన హిట్ లేదు. ఎన్నో ఆశలతో చేసిన ‘కింగ్‌డమ్’ సినిమా అనూహ్య రిజల్ట్‌తో విజయ్ దేవరకొండకు షాకిచ్చింది. ఆ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని అన్నారు కానీ, వచ్చిన రిజల్ట్‌తో అది అటకెక్కింది. ప్రజంట్ విజయ్ దేవరకొండ ఆశలన్నీ ‘ఆర్’ లెటర్ మూవీస్ అయిన ‘రణబాలి’ (Ranabaali), ‘రౌడీ జనార్థన’ (Rowdy Janardhana)పైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కచ్చితంగా హిట్ కావాలి. అప్పుడే విజయ్ కెరీర్‌కి కొన్నాళ్ల పాటు తిరుగుండదు. ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించి వచ్చిన టీజర్స్.. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. కచ్చితంగా ఈసారి విజయ్ దేవరకొండకు హిట్ వస్తుందనే ఫీల్‌ని ఇచ్చాయి, అందులో డౌట్ లేదు కానీ.. విజయ్ క్రేజ్ మీదే ఇప్పుడు డౌట్ ఏర్పడుతుంది. అదెలా అంటే..
Also Read- Dhurandhar: దురంధర్ మూవీని రాహుల్ గాంధీ నిర్మించారా? టైటిల్స్‌లో ఆ పేరు చూసి అంతా షాక్!
విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘రణబాలి’ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదలై దాదాపు వారం రోజులు అవుతుంది. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ చూడగానే అందరికీ నచ్చింది కూడా. కానీ, వారం రోజులు అవుతున్నా, ఈ టైటిల్ గ్లింప్స్ కేవలం అన్ని భాషలలో కలిపి 15 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని మాత్రమే రాబట్టుకోవడం చూస్తుంటే.. విజయ్ దేవరకొండ క్రేజ్‌పై అనుమానాలు మొదలయ్యాయి. రీసెంట్‌గా అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమాకు సంబంధించి విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో.. వ్యూస్ పరంగా రికార్డులను క్రియేట్ చేసింది. అది కేవలం అనౌన్స్‌మెంట్ వీడియోనే. ఇది టైటిల్ గ్లింప్స్. పైగా 5 భాషల్లో కలిపి అంటే నిజంగానే ఎక్కడో తేడా కొడుతుంది శీనా? అనేలా నెటిజన్లు కొందరు రియాక్ట్ అవుతున్నారు.
నిజమే, ‘లైగర్’ టైమ్‌లో బాలీవుడ్‌కి చెందిన ఏ అమ్మాయిని కదిలించినా.. విజయ్ దేవరకొండ పేరే చెప్పేవాళ్లు. అలాగే నేషనల్ క్రష్ ఇమేజ్ ఉన్న రష్మిక మందన్నా కూడా ఇందులో నటిస్తుందని తెలిసినా, కేవలం 15 మిలియన్ల వ్యూస్ అంటే.. విజయ్‌కి హిట్ ఎంత అవసరమో అర్థమవుతోంది. మళ్లీ విజయ్ దేవరకొండ ఫామ్‌లోకి వస్తేనే ఈ కాస్త క్రేజ్ అయినా ఉంటుంది. లేదంటే, మళ్లీ 1 నుంచి మొదలు పెట్టాల్సిందే. ఎందుకంటే, రోజూ ఇండస్ట్రీలోకి ఎంతోమంది వస్తున్నారు. హిట్స్ కొడుతున్నారు. ఇక్కడ హిట్ మాత్రమే మాట్లాడుతుందనే విషయం విజయ్ దేవరకొండకి కూడా తెలుసు. అందుకే ఈసారి కచ్చితంగా కొడతాననే నమ్మకంతో ఉన్నాడు విజయ్. చూద్దాం మరి ఏం జరుగుతుందో? ‘రణబాలి’ విషయానికి వస్తే.. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్నారు. ఇందులో జయమ్మగా రష్మిక మందన్నా కనిపించనుంది.
Also Read- The Raja Saab: లెక్కల్ని బయటకు తీస్తున్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. వాళ్లు దొరికేస్తారా?