E-Paper
Advertisement

Hero Rajasekhar: ఇండస్ట్రీ హిట్స్ వదులుకున్న రాజశేఖర్..ఎంతపని చేశావయ్యా?

Hero Rajasekhar: ఇండస్ట్రీ హిట్స్ వదులుకున్న రాజశేఖర్..ఎంతపని చేశావయ్యా?
Advertisement

Hero Rajasekhar:సాధారణంగా దర్శక రచయితలు ఒక కథను రాసుకునేటప్పుడు… ఫలానా పాత్రల్లో ఫలానా హీరోలు లేదా హీరోయిన్లైతే బాగుంటుందని కథ రాసుకుంటారు. అయితే ఆయా కథలను పట్టుకొని ఫలానా సెలబ్రిటీల దగ్గరకు వెళ్తే వారు నచ్చితే కథ ఒకే చెబుతారు. లేకపోతే రిజెక్ట్ చేస్తారు. లేదా వేరే వారికి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయి జార్చుకున్న సినిమాలు వేరొకరు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే మాత్రం అయ్యో ఇంత గొప్ప సినిమాను మిస్ చేసుకున్నామే అనే బాధ వారిలో ఎప్పటికీ ఉంటుంది. ఈ క్రమంలోనే యాంగ్రీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ (Rajasekhar)కూడా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు ఇండస్ట్రీ హిట్ సినిమాలను చేజేతులారా వదులుకొని స్టార్ డంను కోల్పోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఠాగూర్..

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వచ్చిన రమణ చిత్రానికి రీమేక్ ఇది. ఈ సినిమా కథ మొదట రాజశేఖర్ వద్దకే వెళ్ళింది. కాకపోతే రీమేక్ లపై ఆసక్తి లేక.. పైగా తదుపరి చిత్రాలతో బిజీగా ఉండడం వల్లే రాజశేఖర్ ఈ సినిమాకి నో చెప్పారు. దాంతో చిరంజీవి వద్దకు వెళ్లిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఒకవేళ ఈ సినిమా గనుక రాజశేఖర్ చేసి ఉండుంటే ఈ సినిమాతో ఆయన సూపర్ స్టార్ అయ్యేవారు.

జెంటిల్మెన్:

Advertisement

శంకర్ దర్శకత్వంలో యాక్షన్ హీరో అర్జున్ నటించిన చిత్రం జెంటిల్మెన్ . మొదట ఈ కథ కూడా రాజశేఖర్ వద్దకే వచ్చింది. కానీ రాజశేఖర్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో దీనికి నో చెప్పారు. ఈ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకవేళ అర్జున్ కాకుండా ఈ సినిమాలో రాజశేఖర్ చేసి ఉండి ఉంటే ఆయన కెరియర్ మరో స్థాయికి వెళ్ళుండేది.

also read:Actor Satyadev: గాయపడ్డ హీరో సత్యదేవ్.. నేడే సర్జరీ!

చంటి:

Advertisement

ప్రముఖ డైరెక్టర్ రవిరాజా దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం చంటి. చంటి కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా కూడా హీరో రాజశేఖర్ వద్దకే వెళ్ళింది. కాకపోతే ఇన్నోసెంట్ పాత్ర నచ్చక రాజశేఖర్ నో చెప్పారు. వెంకటేష్ ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక అలా ఏకంగా మూడు ఇండస్ట్రీ హిట్ సినిమాలను వదులుకున్నారు రాజశేఖర్. ఒకవేళ ఈ మూడు చిత్రాలను గనుక ఆయన చేసి ఉండుంటే నేడు టాప్ స్టార్ అయ్యేవారనడంలో సందేహం లేదు..

రాజశేఖర్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. హీరో రాజశేఖర్ ఒకప్పుడు రీమేక్ చిత్రాలు చేయడానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదు. కానీ ఇప్పుడు ఎక్కువగా రీమేక్ చిత్రాల వైపే ఆసక్తి కనబరుస్తూ ఉండడం సంచలనంగా మారింది. ఇకపోతే ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్నారని.. త్వరలోనే ఒక మంచి కథతో సాలిడ్ హిట్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×