E-Paper
Advertisement

Rana Daggubati: సీఐడీ విచారణకు వచ్చి కాంత ప్రమోషన్స్…రానా రూటే సపరేటు!

Rana Daggubati: సీఐడీ విచారణకు వచ్చి కాంత ప్రమోషన్స్…రానా రూటే సపరేటు!
Advertisement

Rana Daggubati: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)నేడు బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సీఐడీ విచారణకు (CID Investigation)హాజరైన సంగతి తెలిసిందే. గతంలో పలు బెట్టింగ్ యాప్స్ అలాగే గేమింగ్ యాప్స్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇదివరకే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో భాగంగా సెలబ్రిటీలు ఈడి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సిఐడి విచారణకు హాజరవుతున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ , ప్రకాష్ రాజ్ వంటి తదితరులు సిఐడి విచారణలో పాల్గొన్నారు. ఇక నేడు ఈ విచారణలో భాగంగా రానా కూడా పాల్గొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా చేయలేదు..

నేడు మధ్యాహ్నం సిఐడి అధికారుల ముందు హాజరైన రానా స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తుంది. ఇక విచారణ అనంతరం ఈయన మీడియా ముందుకు వచ్చి పలు విషయాలను వెల్లడించారు. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ ను మాత్రమే తాను ప్రమోట్ చేసినట్టు ఈయన తెలిపారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతోనూ తాను ఒప్పందం చేసుకోలేదని రానా తెలిపారు. అది పూర్తిగా చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతనే తాను ప్రమోట్ చేశానని వెల్లడించారు. గేమింగ్, గేమింగ్ యాప్స్ గురించి సరైన సందేశాన్ని సరైన విధానాల్లో చేరవేస్తామని తెలిపారు.

సెకండ్ ఆఫ్ లెంగ్త్ ఎక్కువైంది

Advertisement

ఇక ఈ విచారణ గురించి మీడియా పదే పదే ప్రశ్నలు వేస్తున్న నేపథ్యంలో రానా ఏకంగా మీడియాతో సరదాగా కాంత సినిమా(Kaantha Movie) గురించి మాట్లాడారు. దుల్కర్ సల్మాన్ భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా రానా దగ్గుబాటి నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంత. ఈ సినిమా నవంబర్ 14వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. సిఐడి విచారణ తర్వాత మీడియా వారితో రానా మాట్లాడుతూ.. కాంత సినిమా చూశారా? సెకండ్ ఆఫ్ లెంగ్త్ ఎక్కువైంది దాన్ని ట్రిమ్ చేయబోతున్నాను అంటూ సరదాగా మాట్లాడారు.

Advertisement

ఇలా సిఐడి విచారణకు హాజరైన రానా విచారణ గురించి మాట్లాడకుండా కాంత సినిమా గురించి మాట్లాడుతూ ఇక్కడ కూడా తన సినిమాని విభిన్న రీతిలో ప్రమోట్ చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.. సిఐడి విచారణ సమయంలో కూడా ప్రమోషన్లను ఆపరా అన్న.. రానా రూటే సపరేటు అంటూ విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక రానా ప్రస్తుతం హీరోగా సినిమాలు చేయడం కంటే కూడా నిర్మాతగా సినిమాలను నిర్మించడంలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన తెలుగులో విరాటపర్వం అనే సినిమా ద్వారా చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Also Read: IBomma Ravi : కట్టుకున్న భార్యే కొంప ముంచింది… ఐబొమ్మ నిర్వహకుడు రవి ఎలా పట్టుబడ్డాడంటే ?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×