Globe Trotter : మహేష్ బాబు క్రేజ్ గురించి తెలుగు రాష్ట్రంలో కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాల నటుడుగా సినిమా ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమా మహేష్ బాబు కి విపరీతమైన పేరు తీసుకొచ్చింది. ఎమ్మెస్ రాజు నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఒక్కడు సినిమా మహేష్ బాబుకి ఒక స్టార్ ఇమేజ్ తీసుకొచ్చి పెట్టింది. ఆ సినిమా తర్వాత మహేష్ కమర్షియల్ స్టార్ హీరో అయిపోయాడు.
మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. 100 కోట్లు దాటిన సినిమాలు మహేష్ కెరియర్ లో చాలా ఉన్నాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు సర్కారు వారి పాట, గుంటూరు కారం వంటి సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించాయి. అయితే మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా చేస్తే చూడాలి అని అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూశారు. మొత్తానికి ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా టైటిల్ ఈరోజు జరగబోయే ఈవెంట్లో రివిల్ చేస్తారు. అయితే ఈవెంట్ కూడా రాజమౌళి ప్లాన్ చేస్తాడు అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా కోసం ఎంత కేర్ తీసుకుంటాడో అదే స్థాయిలో ఈవెంట్ కోసం కూడా కేర్ తీసుకొని సినిమా జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు.
ఈరోజు జరగబోయే గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ కూడా రాజమౌళి ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సుమా తీసిన వీడియో బాగా వైరల్ అయింది. ఈ ఈవెంట్ లో హాలీవుడ్ మీడియా నుంచి కొన్ని ప్రశ్నలుకు రాజమౌళి మరియు మహేష్ బాబు ఆన్సర్ చేస్తారు.
త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి అంచనాలు ఉండటం సహజం. ఆర్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపును సాధించుకుందో అందరికీ తెలిసిన విషయమే.
అయితే ఈ ఈవెంట్ తో హాలీవుడ్ లో కూడా ఈ సినిమా గురించి ఎక్కువగా తెలియాలి అనే ఉద్దేశంతోనే హాలీవుడ్ మీడియా కూడా రాజమౌళి ఇన్వాల్వ్ చేశారు.
ఈ ఒక ఈవెంట్ తో సినిమా మీద చాలా అంచనాలు పెరిగిపోయే అవకాశం ఉంది. మహేష్ బాబు, కృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూడా ఎటువంటి అప్డేట్స్ ఈ సినిమా గురించి రాలేదు. ఈ ఈవెంట్ కోసం చాలామంది కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. భారీ స్థాయిలో రామోజీ ఫిలిం సిటీ లో ఈవెంట్ మొదలైంది. ఈ సినిమాకి సంబంధించిన వరల్డ్ పరిచయం చేయడంతో పాటు టైటిల్ కూడా రాజమౌళి అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది.
Also Read: Prabhas: డైరెక్టర్ గా మారుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్, ఏకంగా ప్రభాస్ హీరోగా