E-Paper
Advertisement

IBomma Ravi : కట్టుకున్న భార్యే కొంప ముంచింది… ఐబొమ్మ నిర్వహకుడు రవి ఎలా పట్టుబడ్డాడంటే ?

IBomma Ravi : కట్టుకున్న భార్యే కొంప ముంచింది… ఐబొమ్మ నిర్వహకుడు రవి ఎలా పట్టుబడ్డాడంటే ?
Advertisement

IBomma Ravi: సినీ పైరసీ మాఫియా ఐ బొమ్మ (Ibomma)నిర్వాహకుడు ఇమ్మడి రవి(Immadi Ravi)… అలియాస్ ఐ బొమ్మ రాజును నేడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సినిమాలను పైరసీ చేస్తూ ఈయన భారీగా ఆదాయం పొందగా సినిమా ఇండస్ట్రీకి వేలకోట్ల రూపాయల నష్టాన్ని తీసుకువచ్చారు. ఇటీవల సినిమా పైరసీలపై సైబర్ క్రైమ్ ఉక్కు పాదం మోపుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మూవీ పైరసీ తిమింగలం కోసం పోలీసులు కాపు కాస్తూ ఉండగా నేడు అదుపులోకి తీసుకున్నారు. ఈ పోలీసు విచారణలో భాగంగా రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తుంది.

విడాకుల కోసం హైదరాబాద్ వచ్చిన ఐ బొమ్మ రవి

గత కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్న రవి ఒక్కసారిగా అరెస్టు కావడంతో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే రవి వైజాగ్ కు చెందిన వ్యక్తి. అయితే హైదరాబాదులో కూకట్ పల్లిలో ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. ఇక రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విభేదాలు కారణంగా విదేశాలలో ఉన్న ఈయన తన భార్య నుంచి విడాకులు(Divorce) తీసుకోవడం కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఈయన హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు స్వయంగా రవి భార్య(Ravi Wife) సమాచారాన్ని అందవేసినట్టు తెలుస్తుంది.

పోలీసులకు సమాచారం ఇచ్చిన రవి భార్య..

Advertisement

ఈ విధంగా రవి భార్య సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా ఉంచి ఆయనని పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారని స్పష్టమవుతుంది. ఇలా ఈయన అరెస్ట్ వెనుక తన భార్య ప్రమేయం ఉందనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. కట్టుకున్న భార్య తన పాలిట శత్రువులా మారింది అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొంతమంది మాత్రం రవి సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేస్తూ చిత్ర పరిశ్రమకు ప్రాణం పోసారంటూ ఈమెపై కామెంట్లు చేస్తున్నారు.

నాంపల్లి కోర్టుకు ఐ బొమ్మ రవి..

Advertisement

ఇక పోలీసుల అదుపులో ఉన్న రవి నుంచి కొన్ని హార్డ్ డిస్కులు, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈయన నుంచి కొంత కీలక సమాచారాన్ని రాబట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు మరి కాసేపట్లో తనని నాంపల్లి కోర్టు(Nampally Court)లో హాజరు పరచనున్నట్టు తెలుస్తుంది. ఇలా సినిమా పైరసీ కారణంగా చిత్ర పరిశ్రమకు కొన్ని వేలకోట్ల రూపాయల నష్టాన్ని తీసుకువచ్చిన రవికి కోర్టు ఏ విధమైనటువంటి శిక్ష విధిస్తుందో తెలియాల్సి ఉంది. ఇలా మూవీ పైరసీ తిమింగలం పోలీసులకు చిక్కడంతో చిత్ర పరిశ్రమ, నిర్మాతలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మూవీ పైరసీని అడ్డుకోవడం కోసం చిత్ర నిర్మాతలు, పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ పైరసీ మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని పైరసీ పై ఉక్కు పాదం మోపుతున్నారు.

Also Read: Ibomma-Immadi Ravi: నాంపల్లి కోర్టుకు ఐ బొమ్మ ఇమ్మడి రవి.. నిర్మాతలు ఊపిరి పీల్చుకోండి!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×