E-Paper
Advertisement

అలాంటి సినిమాల్లో నటించాలనుంది.. శ్రీలీల కల నెరవేరేనా?

అలాంటి సినిమాల్లో నటించాలనుంది.. శ్రీలీల కల నెరవేరేనా?
Advertisement

Sree Leela:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సొంతం చేసుకున్న శ్రీ లీలా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ అతి తక్కువ సమయంలోనే ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. కానీ ఈమె ఖాతాలో ఇప్పటివరకు ధమాకా రేంజ్ లో సరైన సక్సెస్ పడలేదు అనడంలో సందేహం లేదు. పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్లోకి మెరుపులా ప్రవేశించిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అద్భుతమైన డాన్సులతో.. నటనతో కుర్రకారును మాయ చేసింది. తెలుగులో కూడా స్టార్ హీరోల సరసన నటించి కెరియర్ గ్రాఫ్ ను అమాంతం పెంచుకున్నప్పటికీ ఇటీవల కాలంలో ఆమె నటించిన భారీ చిత్రాల ఫలితాలు ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి.

కోలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శ్రీలీల..

ఇక అందుకే తన రూట్ కూడా మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ . వాస్తవానికి హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తన కెరీర్ ను మార్చేస్తుందని ఎన్నో కలలు కనింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తెలుగులో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఫలితంగా తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ వైపు దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. తొలిసారి కోలీవుడ్ లో శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమా ద్వారా కోలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు ధనుష్ సరసన ధనుష్ 55వ చిత్రంలో అవకాశాన్ని అందుకుంది.

అలాంటి పాత్రలలో నటించాలని కోరిక – శ్రీ లీల

Advertisement

ఈ క్రేజీ ప్రాజెక్టుతో పాటు బాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటిస్తూ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి డాన్స్ లో ఇరగదీసే శ్రీ లీల ధనుష్ వంటి నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన కెరియర్ గురించి శ్రీ లీలా మాట్లాడుతూ.. “కేవలం నేను గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా బలమైన సెంటిమెంట్ ఉన్న కుటుంబ కథా నేపథ్యం కలిగిన చిత్రాలలో నటించాలని కోరుకుంటున్నాను. వైవిద్య భరితమైన పాత్రలు చేసినప్పుడే నటిగా నాలోని పూర్తిస్థాయి ప్రతిభను బయటకు తీస్తాయి. అందుకే కథల ఎంపిక విషయంలో ఇకపై జాగ్రత్త వహించాలని చూస్తున్నాను” అంటూ ఆమె తెలిపింది .

ALSO READ:బ్లాక్ ఫారెస్ట్ లో మహేష్ ప్రత్యేక శిక్షణ.. ఎందుకంటే?

శ్రీ లీల కల నెరవేరుతుందా?

Advertisement

మొత్తానికి అయితే శ్రీలీల చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక శ్రీ లీల విషయానికి వస్తే పెళ్లి సందD సినిమా తర్వాత ధమాకా సినిమా చేసిన ఈమె.. ఈ సినిమాతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తోంది కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు లభించడం లేదు. పేరుకే స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కమర్షియల్ రేంజ్ లో క్రేజ్ అందుకోలేకపోయింది అనే కామెంట్లు నెటిజన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఎలాగో తన మనసులోని కోరికను బయటపెట్టింది. కనీసం ఇప్పటికైనా అమ్మడికి అలాంటి అవకాశాలు లభిస్తాయేమో చూడాలి.

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×