PSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు (Pakistan Super League 2026 Tournament) చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం (Gaddafi Stadium, Lahore) వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. రాత్రి 8:30 గంటలకు ఈ మ్యాచ్ షురూ అవుతుంది. ఇలాంటి క్రమంలో పెషావర్ జల్మీ జట్టు (Peshawar Zalmi) ఛాంపియన్ కావాలంటూ హిందువు పూజలు చేసిన వీడియో వైరల్ గా మారింది. బాబర్ ఆజం ( Babar Azam) ఆధ్వర్యంలోని ఈ జట్టు ఛాంపియన్ కావాలని శివయ్య విగ్రహం ముందు ప్రత్యేక పూజలు చేశాడు ఓ హిందువు. ఈ సంఘటన కాశ్మీర్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కోసం పూజలు చేసిన ఈ హిందువు వీడియో వైరల్ గా మారింది.
Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో మరో అరాచకం.. డబ్బులు లేక ఆంటీలతో క్లీన్ చేయిస్తున్నారు, దొంగల్లా దూరేస్తున్నారు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా పేషావర్ జల్మీ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్ల మధ్య ఫైనల్ ఉంటుంది. రాత్రి 8:30 గంటలకు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ షురూ కానుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. అభిమానులు కూడా స్టేడియానికి ఇప్పటినుంచే వస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రారంభం కంటే ముందు క్లోజింగ్ సెర్మనీ కూడా ఉంటుంది. పెషావర్ జల్మీ జట్టును బాబర్ ఆజం లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు హైదరాబాద్ కింగ్స్ మెన్ కెప్టెన్ గా మార్నస్ లాబుస్చాగ్నే ( Marnus Labuschagne) ఉన్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఇండియాకు సంబంధించిన ఓ హిందువు ప్రత్యేక పూజలు చేసిన వీడియో వైరల్ గా మారింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును బాబర్ ఆజం జట్టు గెలుచుకోవాలని పూజలు చేశాడు. ఈ మేరకు శివపార్వతుల ముందు.. బాబర్ ఫోటోను పెట్టి మరి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై రకరకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇండియాలో ఉండే హిందువులకు కొంచమైనా బుద్ధి లేదా ? పాకిస్తాన్ వాడికి సపోర్ట్ చేస్తూ పూజలు చేస్తారా ? ఇలాంటి హిందువులను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. శివుడి ముందు బాబర్ ఫోటోలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వెధవలను ఇండియా నుంచి తరిమికొట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. అర్ధరాత్రి విజేత ఎవరు అనేది కూడా తేలిపోనుంది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజేత ప్రైజ్ మనీ ఎన్ని కోట్లు అని సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 4.18 కోట్లు అందించనున్నారు. రన్నరప్ జట్టుకు రూ.2.15 కోట్లు ఇస్తున్నారు.
Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండగా రొమాన్స్..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైరల్
A Hindu fan praying for Babar Azam to lift the PSL trophy. 🥺❤ pic.twitter.com/aPGGxw2KiR
— Abdullah. (@Abdullahh_56) May 3, 2026