E-Paper
Advertisement

High: అనిల్ రావిపూడి కో-రైటర్ హీరోగా.. ఏం ‘హై’ ఇచ్చాడురా బాబు!

High: అనిల్ రావిపూడి కో-రైటర్ హీరోగా.. ఏం ‘హై’ ఇచ్చాడురా బాబు!
Advertisement

High: హిట్ మేకర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) అసోసియేట్, అతని అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సహ రచయితగా పని చేసిన ఎస్ కృష్ణ (S Krishna).. ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అదేంటి? అంతా అనిల్ రావిపూడి హీరో ఎప్పుడవుతాడా? అని ఎదురు చూస్తుంటే, ఆయన అసోసియేట్ ఏకంగా హీరో అయ్యి చూపించి యమా ‘హై’ (High) ఇచ్చాడు కదా. ఈ సినిమాకు హీరోగానే కాదు.. దర్శకుడు, రచయిత, సహ నిర్మాతగా కూడా. ఇమేజ్‌ స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను విక్టరీ వెంకటేష్ ఆవిష్కరించి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీజర్‌ని గమనిస్తే..

Also Read- Thammareddy: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘పెద్ద’ ఎవరూ లేరు! తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్

ఎమోషన్స్‌తో కూడిన డ్రామా

Advertisement

ఒక గ్రిప్పింగ్ ఆంథాలజీగా ఈ ‘హై’ని రూపొందించినట్లుగా తెలుస్తోంది. నలుగురు వ్యక్తులను ప్రజెంట్ చేస్తూ ఈ టీజర్ నిజంగా ‘హై’ ఫీల్‌ని ఇస్తోంది. ఒక అమ్మాయి తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి ఒకరిని నియమించుకుంటుంది, మరొక వ్యక్తి మద్యంలో తన ‘హై’ వెతుక్కుంటాడు, మరొక అమ్మాయి తన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడంలో తాను ‘హై’ ఫీలవుతుంటే, ఆమె ప్రేమికుడు ప్రమాదకరమైన పందాలను కాస్తుంటాడు. ఇలా సాగిందీ టీజర్. ఎస్ కృష్ణ ఒక బోల్డ్ కథని ఎమోషన్స్‌తో కూడిన డ్రామాగా తెరకెక్కించారనేది ఈ టీజర్ తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ నటనతో ‘హై’ ఇచ్చారు. టెక్నికల్‌గానూ ఈ సినిమా హై స్టాండర్ట్స్‌లోనే ఉంటూ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా టాకీ భాగం పూర్తయిందని, పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉందని మేకర్స్ తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరిపి, త్వరలోనే రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించనున్నారు.

Also Read- Upasana Konidela: మీ ప్రేమ, అభిమానం స్వచ్ఛమైందని అంటూనే.. మెగా ఫ్యాన్స్‌కు క్లాస్!

టీమ్ అందరికీ ‘హై’ రావాలి

Advertisement

ఇక తన శిష్యుడి సినిమా టీజర్ లాంచ్ వేడుకలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నా సినిమాలకు పనిచేస్తూనే, గ్యాప్‌లో ఈ షూటింగ్ చేసేవాడు. ఒక బెస్ట్ ఫ్రెండ్‌గా నా విషెస్ ఎప్పుడు తనకు ఉంటాయి. తను మంచి టెక్నీషియన్‌గా, ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో హై స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. తను యాక్టర్‌గా కూడా సక్సెస్ అయ్యాడు. నాతో ఉన్నప్పుడు సాయి ఒక రకంగా ఉంటాడు. తను చేసిన సినిమా తర్వాత మరొక సాయి కనిపించాడు. మంచి జడ్జిమెంట్ ఉన్న టెక్నీషియన్. ఒక కొత్త జానర్‌లో డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో తీసిన సినిమా ఇది. ఆడియన్స్ చూసిన తర్వాత తన ప్రయత్నాన్ని కచ్చితంగా ఆదరిస్తారు. సాయి వంటి ఫ్రెండ్ ఉంటే లైఫ్ చాలా సక్సెస్ ఫుల్‌గా ఉంటుంది. తను చాలా ముక్కు సూటిగా ఉంటాడు. ఈ సినిమాకి ‘హై’ అనే టైటిల్ పెట్టారు. అలాంటి హై టీమ్ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

Also Read- Dhanush: రెండు బయోపిక్స్ ఒకేసారి చెయ్యడానికి సిద్ధమైపోయిన సౌత్ స్టార్ హీరో.. సాధ్యమేనా..?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×