Upasana Konidela: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) సతీమణి, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల (Upasana Konidela) ఇటీవల మెగా ట్విన్స్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మెగా ట్విన్స్ (Mega Twins)కు జన్మనిచ్చిన అనంతరం తొలిసారిగా మెగా కోడలు ఉపాసన ట్విట్టర్ ఎక్స్ వేదికగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడూ తన హుందాతనంతో, సామాజిక స్పృహతో అందరినీ ఆకట్టుకునే ఉపాసన.. కేవలం కృతజ్ఞత మాత్రమే కాదు, ఈ ట్వీట్‌లో ఒక తల్లి ఆవేదన, అభిమానుల పట్ల ఉన్న నమ్మకం, వైద్యులపై ఉన్న గౌరవాన్ని స్పష్టంగా తెలియజేశారు. అలాగే అభిమానులు అత్యుత్సాహంపై కూడా ఆమె చాలా సున్నితంగా కౌంటర్ వేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌ను గమనిస్తే..
Also Read- Nagarjuna: అక్కినేని నాగార్జునకు మరికొన్ని ఫ్లాపులు తప్పవా.. నిరాశలో అభిమానులు..!
ఒక ఫ్యామిలీలోకి ఒక చిన్న ప్రాణం అడుగుపెట్టే సమయంలో డాక్టర్స్ పాత్ర ఎంత కీలకమో ఉపాసనకు బాగా తెలుసు. అందుకే ఆమె తేజస్వి, ఇంకా అపోలో హాస్పిటల్ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. వారి అంకితభావం, సంరక్షణ వల్లే తాము ఈ సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. ఆమె బిడ్డలకు జన్మనివ్వడానికి ఆస్పత్రికి వెళుతున్నప్పటి నుంచి, జన్మనిచ్చేవరకు జరిగిన విషయాలను చాలా క్లుప్తంగా తెలుపుతూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఇందులో డాక్టర్స్, ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేయడం విశేషం. ఇక డాక్టర్స్‌కు ధన్యవాదాలు తెలిపిన ఉపాసన మెగా ఫ్యాన్స్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మెగా ట్విన్స్ పుట్టినరోజున అపోలో హాస్పిటల్స్ దగ్గర జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్నపాటి క్లాస్ కూడా ఆమె అభిమానులకు ఇచ్చారు.
Also Read- Aadi Saikumar: ‘శంబాల’ తర్వాత ఆది చేస్తున్న చిత్రమిదే.. మళ్లీ హిట్ కొడతాడా?
రామ్ చరణ్ అభిమానులను ఉపాసన ఎప్పుడూ తన సొంత వ్యక్తులుగానే భావిస్తారు. వారి ప్రేమలో ఎంతో స్వచ్ఛత ఉందని కొనియాడుతూనే, ఒక తల్లిగా ఆమె చిన్న విన్నపం చేశారు. ‘‘మీ ప్రేమ మంచి మనసు నుంచి వస్తుందని నాకు తెలుసు. మా పిల్లల భద్రతను, వారి వ్యక్తిగత గోప్యతను మీరు ఎల్లప్పుడూ గౌరవిస్తారని, వారిని కాపాడతారని నేను నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు. అభిమానం అతిగా మారి పిల్లల భద్రతకు ఇబ్బంది కలగకూడదనే ఒక సున్నితమైన సందేశాన్ని ఆమె ఇందులో చాలా చాకచక్యంగా చెప్పడం విశేషం. ఫైనల్‌గా.. ప్రపంచవ్యాప్తంగా తమ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆ ఆశీస్సులు తమతో ఎప్పటికీ ఉంటాయని, తమ కుటుంబం ఎంతో అదృష్టవంతులని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఉపాసన చేసిన ఈ ట్వీట్‌కు ‘మేమంతా ఉన్నాం వదినమ్మ, బిడ్డల క్షేమాన్ని మేము చూసుకుంటాం’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Every time I watch this, my heart feels full. I’m deeply grateful for the love, strength, and positivity that surrounds us. With folded hands 🙏, THANK YOU
My family is truly blessed.
Tejesvi Garu & the entire @HospitalsApollo team — your care & commitment meant everything to us.… pic.twitter.com/FKRtfBfMy9— Upasana Konidela (@upasanakonidela) February 9, 2026
Also Read- Supritha: ఇది మా నాన్న కోరిక..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సుప్రీత.. ఏం జరిగిందంటే?