E-Paper
Advertisement

Thammareddy: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘పెద్ద’ ఎవరూ లేరు! తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్

Thammareddy: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘పెద్ద’ ఎవరూ లేరు! తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
Advertisement

Thammareddy: దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) తెలుగు సినిమా ఇండస్ట్రీకి (Tollywood) సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆయనకు మైక్ దొరికితే చాలు, ఏదో ఒక కాంట్రవర్సీ మాటలు మాట్లాడటం అలవాటే. అలాగే ఒక మాట మీద కూడా ఉండరు. ముఖ్యంగా ఆయన మాట్లాడే మాటలన్నీ వైసీపీకి సపోర్ట్‌గా ఉంటుంటాయి. వాస్తవానికి ఆయనని కూడా ఇండస్ట్రీలో ఓ పెద్ద మనిషిగా చూస్తుంటారు. చిన్న సినిమాల ఫంక్షన్స్‌కు తమ్మారెడ్డిని గెస్ట్‌గా పిలుస్తుంటారు. అలాంటి తమ్మారెడ్డి భరద్వాజ తన పెద్దరికాన్ని నిలుపుకోవాల్సింది పోయి, ఏదేదో మాట్లాడేస్తుంటారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు లేరని, ఎవరి దగ్గరకు వెళ్లిన సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదని తన తాజా ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

Also Read- Upasana Konidela: మీ ప్రేమ, అభిమానం స్వచ్ఛమైందని అంటూనే.. మెగా ఫ్యాన్స్‌కు క్లాస్!

ఆరోజుల్లో పుల్లలు పెట్టేవారు లేరు కాబట్టే..

Advertisement

ఎప్పుడో సోషల్ మీడియాలు, ఇతర మీడియాల ప్రభంజనం లేనప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించిన దాసరిని కూడా ఆయన వదల్లేదు. ఎన్టీఆర్ తర్వాత అనుకోకుండా దాసరికి పెద్దరికం పదవి వచ్చిందని, ఇప్పుడసలు ఇండస్ట్రీలో పెద్ద అనే వారే లేరని తమ్మారెడ్డి అన్నారు. ‘దాసరి (Dasari), ఎన్టీఆర్‌ (NTR)ను రీప్లేస్ చేసే మనుషులు ఏ రకంగానూ ఇక రారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే, పలానా మనిషి దగ్గరకు వెళితే సమస్య పరిష్కారం అవుతుందనే పరిస్థితులు లేవు’ అని తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చెప్పిందంతా బాగానే ఉంది కానీ, ఆ పరిస్థితులను కల్పించింది ఎవరో కూడా తమ్మారెడ్డి చెప్పి ఉంటే బాగుండేది. అప్పట్లో దాసరి పెద్దరికం చేసినప్పుడు, ప్రస్తుతం ఉన్నంత పెద్ద సమస్యలేవీ లేవు. రెండు సినిమాలు క్లాష్ అవుతుంటేనే, షూటింగ్స్ షెడ్యూల్స్ విషయంలోనో తగాదాలు వస్తే దాసరిని సంప్రదించేవారు. ఎన్టీఆర్ రాజకీయాలతో బిజీగా ఉండడం, ఏఎన్నార్ నాకెందుకులే అని కామ్‌గా ఉండటం, కృష్ణ ప్రయోగాలు చేస్తుండటంలో బిజీగా ఉండటంతో.. దాసరికి ఎదురు చెప్పేవారు, పెద్దరికం విషయంలో పుల్లలు పెట్టేవారు లేరు, కాబట్టి గడిచిపోయింది.

Also Read- Nagarjuna: అక్కినేని నాగార్జునకు మరికొన్ని ఫ్లాపులు తప్పవా.. నిరాశలో అభిమానులు..!

ఆయన కలగజేసుకుంటే.. కాదనే వారెవ్వరు?

Advertisement

కానీ, నేటి పరిస్థితి అలా లేదు. ప్రత్యేకంగా ఇండస్ట్రీకి నేనే పెద్ద అని ప్రకటించుకున్నవారు కూడా ఉన్నారు. ఒక్క రూపాయి ఇండస్ట్రీ కోసం ఖర్చు పెట్టడానికి వంద రకాలుగా ఆలోచించే వారు కూడా నేనే ఇండస్ట్రీ పెద్దనని ప్రకటించుకున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని అంతా పెద్దగా భావిస్తుంటే, ఒక బ్యాచ్ మొత్తం వెళ్లి బాలకృష్ణకి బాగా ఎక్కేయడం, ఆయన నోటికి వచ్చింది మాట్లాడటం తెలియంది ఎవరికి. వెంకీ, నాగ్ ఎలాగూ.. ఈ లీగ్‌లోకి ఎంటరవరు కాబట్టి, ఏ చిన్న విషయం ఉన్నా, వెంటనే రియాక్ట్ అయ్యే పర్సన్, ప్రభుత్వాలతో మాట్లాడగల స్టామినా ఉన్న స్టార్ ఎవరైనా ఉన్నారూ అంటే, అది కేవలం చిరంజీవి మాత్రమే. ఆయనే నాకు ఈ పెద్దరికం వద్దని పబ్లిగ్గా చెప్పారు. ఇద్దరి మధ్య గొడవలు తీర్చే పెద్దరికం నాకు వద్దు, కష్టం అని వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ఇంటి తలుపు తెరిచే ఉంటుందని చిరంజీవి ఓపెన్‌గా చెప్పారు. ఇంతకంటే పెద్దరికానికి కావాల్సిన అర్హత ఏముంటుంది? నిజంగా చిరంజీవి కలగజేసుకుంటే అవ్వని పని ఉంటుందా? తీరని సమస్య ఉంటుందా? ఏం తమ్మారెడ్డి ఏమంటారు?

Also Read- Tollywood: ఎపిసోడ్ డైరెక్టర్‌ గా కెరియర్ మొదలు.. కట్ చేస్తే మూవీస్ లో స్టార్ స్టేటస్.. లిస్ట్ పెద్దదే!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×