E-Paper
Advertisement

Tollywood: మళ్లీ షూటింగ్స్ ఆగిపోతున్నాయా? వారు సమ్మెకు సిద్ధమవుతున్నారా?

Tollywood: మళ్లీ షూటింగ్స్ ఆగిపోతున్నాయా? వారు సమ్మెకు సిద్ధమవుతున్నారా?
Advertisement

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో (Tollywood) మళ్లీ సమ్మె హారన్ మోగనున్నట్లుగా టాక్ నడుస్తోంది. గతేడాది సమ్మె (Strike) సెగలు చల్లారి, ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందనుకుంటున్న తరుణంలో.. టెక్నీషియన్లు, ప్రొడక్షన్ యూనియన్లు మరోసారి ‘సమ్మె’ అస్త్రాన్ని బయటకు తీశాయి. తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని మండిపడుతూ, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడికి ఘాటుగా లేఖలు రాశారు. ఇప్పుడు లేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇలాగే కార్మికులు రోడ్డెక్కితే, షూటింగ్‌లన్నీ ఆగిపోయి టాలీవుడ్ స్తంభించిపోయింది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి, ఇరు పక్షాలతో చర్చలు జరిపి, ఒక మధ్యేమార్గం చూపింది. దాంతో అంతా సద్దుమణిగింది అని ఊపిరి పీల్చుకునేలోపే.. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు గానీ, ఫెడరేషన్ చేసిన వాగ్దానాలు గానీ ఆచరణలోకి రాలేదన్నది టెక్నీషియన్ల ప్రధాన ఆరోపణ.

Also Read- Pawan Kalyan: పవన్ సినిమాలో యంగ్ హీరో క్యామియో..థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!

డిమాండ్లు ఇవే..

Advertisement

ప్రధానంగా టెక్నీషియన్ యూనియన్, ప్రొడక్షన్ యూనియన్లు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరో 11 యూనియన్లు కూడా ఇదే అసంతృప్తితో ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. వేతనాల పెంపు, పని వేళల్లో స్పష్టత, కార్మికుల సంక్షేమం, బీమా సౌకర్యాలు వంటి డిమాండ్లతో టెక్నీషియన్ యూనియన్, ప్రొడక్షన్ యూనియన్లు లేఖలు సంధించాయి. ఈ ఫిబ్రవరి ఆఖరులోపు చర్చలు ఫలించకపోతే, మార్చి 1 నుంచి కెమెరాలకు విశ్రాంతి ఇచ్చేస్తామని, షూటింగ్‌లను బహిష్కరిస్తామని వారు అల్టిమేటం జారీ చేశారు. అదే జరిగితే మరోసారి టాలీవుడ్‌కు సంక్షోభం తప్పదు.

Also Read- Arjun sarja : పవన్ కళ్యాణ్ పై అర్జున్ సర్జా కామెంట్స్.. కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు అంటూ

భారీ చిత్రాలపై ఎఫెక్ట్!

Advertisement

ప్రస్తుతం టాలీవుడ్‌లో సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న భారీ బడ్జెట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ మార్చిలో సమ్మె మొదలైతే, నిర్మాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. రోజుకు కోట్లలో వడ్డీలు, కాల్షీట్ల సమస్యలు ఇండస్ట్రీని కుదిపేసే ప్రమాదం ఉంది. ‘సినీ కార్మికుడు బాగుంటేనే సినిమా బాగుంటుంది. కానీ, అదే కార్మికుడు పస్తులుంటే ఇండస్ట్రీకి కళ ఉండదు’ అని అంటారు. మళ్లీ అలాంటి రోజులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా సినీ పెద్దలు, ఛాంబర్ ప్రతినిధులు, ప్రభుత్వం కలిసి కూర్చుని ఒక శాశ్వత పరిష్కారాన్ని వెతకాలి. సమ్మె అనేది సమస్యకు పరిష్కారం కాకపోయినా, కార్మికుల ఆకలి కేకలను వినాల్సిన బాధ్యత ఉంది కదా. మరి ఈ నెలాఖరులోపు చర్చలు సఫలమై ‘లైట్స్.. కెమెరా.. యాక్షన్..’ అని వినిపిస్తుందో లేక స్టూడియోలు నిశ్శబ్దంగా మారిపోతాయో వేచి చూడాలి.

Also Read- High: అనిల్ రావిపూడి కో-రైటర్ హీరోగా.. ఏం ‘హై’ ఇచ్చాడురా బాబు!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×