BigTV English

Himaja: హిమజా లెమన్ టాస్క్.. నీళ్లు కిందపడకుండా ఆ నిమ్మకాయను పైకి తీయగలరా?

Himaja: హిమజా లెమన్ టాస్క్.. నీళ్లు కిందపడకుండా ఆ నిమ్మకాయను పైకి తీయగలరా?

Himaja: నిత్యం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు అప్పుడప్పుడు కాస్త సమయం దొరికితే చాలు తమ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది వెకేషన్ కి వెళ్తే.. మరి కొంతమంది ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకున్న హిమజ (Himaja)తాజాగా తన స్నేహితులకు ఒక టాస్క్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. తాను పెట్టిన టాస్క్ లో ఎవరైతే గెలుస్తారో వారికి 10,000 అంటూ బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది. మరి హిమజ పెట్టిన ఆ టాస్క్ వారి స్నేహితులు పూర్తి చేశారా? గెలిచి, పదివేలు సొంతం చేసుకున్నారా? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.


లెమన్ టాస్క్ ఇచ్చిన హిమజ..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా హిమజ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియో పంచుకుంది. అందులో ఆమె మాట్లాడుతూ..సమయం ఖాళీగా ఉంది.. ఏం చేయాలో తెలియడం లేదు అని చెబుతూనే తన ఇద్దరు స్నేహితురాళ్లకు ఒక టాస్క్ విధించింది. ఎదురుగా టేబుల్ పైన ఒక నీటితో నింపిన గ్లాస్ ని పెట్టి, అందులో నిమ్మకాయ వేసింది. నీళ్లు కింద పడకుండా గ్లాస్ లోపల ఉన్న నిమ్మకాయను బయటకు తీయాలి. ఇద్దరిలో ఎవరు మొదట గెలిస్తే వారికి పదివేల రూపాయలు.. అయితే ఒక్కొక్కరికి ఒకటే ఛాన్స్ అంటూ లెమన్ టాస్క్ ఇచ్చింది. దాంతో తన ఇద్దరు స్నేహితురాళ్ళు కూడా ఈ టాస్క్ ను గెలవలేకపోతారు. కానీ హిమజ చాకచక్యంగా గ్లాసులో వేలు పెట్టి నీటిని కదిలిస్తూ సునాయాసంగా నిమ్మకాయను తీసేసింది.


భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..

ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..”మీకు ఏదైనా ఇంకో ఐడియా ఉందా ?” అంటూ టాస్క్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో పాటు నెటిజన్స్ కూడా.. “స్పూన్ తో తీయొచ్చు కదా” అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు “సాల్ట్ వేసినా వస్తుంది”అంటూ కామెంట్ పెట్టారు. ఇంకొకరు “నిన్న వచ్చిన రీల్ ని చూసి ఇప్పుడు ట్రై చేస్తున్నావా?” అని కామెంట్ చేశారు. ఇంకొకరు” ఆ వాటర్ తాగి లెమన్ తీయండి.. సరిపోతుంది” అంటూ ఇలా ఎవరికి తోచిన కామెంట్లు వాళ్ళు చేస్తూ వైరల్ అవుతున్నారు. మొత్తానికైతే హిమజా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

హిమజా సినిమాలు..

ఇక హిమజా విషయానికి వస్తే.. సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. స్వయంవరం, భార్యామణి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందిన ఈమె.. శివం అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ 3 లో పాల్గొని 63వ రోజు ఎలిమినేట్ అయింది. ఇక చివరిగా దేవర , ధీర అనే సినిమాలలో నటించిన ఈమె.. ఇప్పుడు సరదాగా హ్యాపీ లైఫ్ లో లీడ్ చేస్తోందని చెప్పవచ్చు.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ%3D%3D

also read: Ram Charan: త్వరలో రంగస్థలం 2.. ఆ టార్గెట్ దిశగా చెర్రీ.. నిజమైతే బన్నీ తర్వాత స్థానం!

Related News

OG Movie: ఓజి సినిమాపై మెగాస్టార్ రివ్యూ… హాలీవుడ్ కు ఏమాత్రం తగ్గలేదంటూ!

I Bomma : పైరసీ సైట్ ఐబొమ్మకు ఇక మూడినట్టే… నలుగురు అరెస్ట్

Tollywood : ఇండస్ట్రీ బాగు కోసం… టాలీవుడ్ పిల్లర్ బాలకృష్ణ ఎక్కడా ?

Shukracharyudu in Mahakali : ప్రశాంత్ యూనివర్స్‌లో శుక్రచార్యడు… పురాణాల్లో ఈయన పాత్ర ఏంటో తెలుసా ?

The Raja Saab Trailer : ట్రైలర్ రాకపోయి ఉంటే బాగుండు

Nani Sujeeth : దసరాకు నాని – సుజీత్ మూవీ.. అప్పుడే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్

SSMB 29: టార్గెట్ ఫిక్స్ చేసిన జక్కన్న.. అయోమయంలో మహేష్!

Chiru vs Balayya : బాలయ్యపై మెగా ఫ్యాన్స్ వార్… 300 పోలీస్ స్టేషన్లల్లో కేసు ?

Big Stories

×