BigTV English

War 2 Collections : ‘కూలీ’ కన్నా ‘వార్ 2’ కలెక్షన్స్ అంత తక్కువా.. వీకెండ్ కలిసివస్తుందా..?

War 2 Collections : ‘కూలీ’ కన్నా ‘వార్ 2’ కలెక్షన్స్ అంత తక్కువా.. వీకెండ్ కలిసివస్తుందా..?

War 2 Collections : టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటించిన బాలీవుడ్ యాక్షన్ మూవీ వార్ 2.. ఆగస్టు 14 ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస హిట్ సినిమాలలో నటించిన ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో సత్తాని చాటాడో తెలుసుకోవాలని అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి షో తోనే బాక్సాఫీస్ హిట్ అనే టాక్ ని సొంతం చేసుకుంది.. ఎన్టీఆర్ పర్ఫామెన్స్ ఊహించని విధంగా ఉందని ఫాన్సు ఫుల్ ఖుషి అవుతున్నారు. మొత్తానికి పబ్లిక్ టాక్ ను చూస్తే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకునేలా కనిపిస్తుంది.. రజినీకాంత్ నటించిన కూలీ మూవీ కూడా రిలీజ్ అవ్వడంతో ఈ మూవీ కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. మరి మొదటి రోజు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో చూద్దాం.


‘వార్ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్..

టాలీవుడ్ స్టార్మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ చిత్రమే ‘వార్ 2’.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించారు. అందుకే ఎక్కువగా ఈ మూవీకి బాలీవుడ్ లోనే ప్రమోషన్స్ చేశారు. తెలుగులో ఒకే ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.. అయినా కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు.. మొదటిరోజు బాక్సాఫీస్ ని షేర్ చేసిందని చెప్పాలి.. ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. అంటే రజినీకాంత్ కూలి కన్నా తక్కువే అని చెప్పాలి.. మరి ఈ వీకెండ్ అన్న వార్ 2 సినిమాకు కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాలి…


Also Read :  బాక్సాఫీస్ వద్ద ‘కూలీ ‘ జోరు.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే..?

“వార్ 2” మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.. ఆ తర్వాత వచ్చిన బాలీవుడ్ తొలి మూవీ వార్ 2.. ఎన్నో అంచనాల మధ్య నిన్న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ అయింది.. ఈ మూవీలో స్పెషల్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ నటించారు.. డాన్ పాత్రలో హృతిక్ రోషన్ నటించాడు.. వీరిద్దరి మధ్య ఫైట్ నడుస్తున్న సమయంలో ఎన్టీఆర్ కు తెలిసిన ఒక నిజం స్టోరీని మలుపు తిప్పుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో తిరిగిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది.. త్రిబుల్ ఆర్ తర్వాత మల్టీస్టారర్ గా వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది. అటు రజనీకాంత్ కూలి సినిమా ఉండడంతో ఈ సినిమాకి కాస్త కలెక్షన్స్ తగ్గాయని తెలుస్తుంది. మరి టోటల్ కలెక్షన్స్ ఎన్ని కోట్లు వస్తాయో చూడాలి.. ఏది ఏమైనా ఈ మూవీతో మరోసారి హిట్ కొట్టాడు ఎన్టీఆర్..

Related News

Vishwak Sen: మళ్ళీ పేరు మార్చుకున్న నటుడు విశ్వక్ సేన్… సక్సెస్ కోసమేనా?

Actor Nani: ముసుగు వేసుకుని మరీ థియేటర్ లో ఆ సినిమాలు చూసిన నాని.. వీడియో వైరల్!

Upasana: ఉపాసనకు కూడా ఇలాంటి అలవాటు ఉందా… గంటల తరబడి అదే పనిచేస్తుందా?

Prabhas: ఆ సత్తా చాటిన ఏకైక హీరోగా ప్రభాస్.. ఏకంగా ఐదు చిత్రాలు!

Coolie-War 2 : కూలీ, వార్ 2ను వణికిస్తున్న చిన్న సినిమా… ఒక్క రోజుకే వీటి పనైపోయిందా ?

Venkatesh – Trivikram : వెంకీ – త్రివిక్రమ్ మూవీ ప్రారంభం.. రెగ్యులర్ షూట్ అప్పుడే..?

Big Stories

×