BigTV English

YS Sharmila: చంద్రబాబు-జగన్‌పై హాట్ కామెంట్స్.. ఇద్దరికీ తేడా లేదన్న షర్మిల

YS Sharmila: చంద్రబాబు-జగన్‌పై హాట్ కామెంట్స్.. ఇద్దరికీ తేడా లేదన్న షర్మిల

YS Sharmila: సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ఏపీలో కూటమి ప్రభుత్వం-విపక్ష వైసీపీ ఏకి పారేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఆనాడు కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేస్తే.. పులివెందులలో సీఎం చంద్రబాబు అదే చేశారని వ్యాఖ్యానించారు. అసలేం జరిగింది?


ఏపీలో రాజకీయాలు విచిత్రంగా కొనసాగుతున్నాయి. నేతలపై కేసుల వెంటాడడంతో ప్రతిపక్షం వైసీపీ డీలా పడిపోయింది. ఆ గ్యాప్‌ని ఫుల్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. మెల్ల మెల్లగా అవకాశం చిక్కినప్పుడల్లా టీడీపీ-వైసీపీ పార్టీలను చీల్చిచెండాడుతున్నారు షర్మిల.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలో పార్టీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురువేశారు వైఎస్ షర్మిల. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె అధికార టీడీపీ-వైసీపీలపై విరుచుకుపడ్డారు. ఆనాడు కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేస్తే.. పులివెందులలో చంద్రబాబు సర్కార్ అదే చేసిందన్నారు.


ఈ విషయంలో చంద్రబాబు-జగన్ ఇద్దరికీ తేడా లేదన్నారు. ఇద్దరు కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శలు గుప్పించారు. ఇద్దరు కలిసి మోడీ కోసం పని చేస్తున్నారన్నారు. ఒకరిది బహిరంగ పొత్తు, మరొకరిది అక్రమ పొత్తుగా వర్ణించారు.

ALSO READ: ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు.. మరో రెండురోజులు కుండపోత వర్షాలు

ఓటు చోరీపై మోదీకి సీఎం చంద్రబాబు, జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే దేశంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు.  షర్మిల వ్యాఖ్యలపై ఏపీలో రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.

మొన్నటి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది.  గట్టి పోటీ ఇస్తుందని భావించిన వైసీపీ.. రీపోలింగ్‌కు ముందే చేతులు ఎత్తేసింది. కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అదే పల్లవి ఎత్తుకున్న విషయం తెల్సిందే. చివరకు పులివెందులలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు.

దీనికితోడు రెండు పార్టీల అధినేతలు ఒకే పార్టీకి మద్దతు ఇస్తే.. ప్రశ్నించేది ఎవరన్నది షర్మిల మాటగా చెబుతున్నారు నేతలు. మరికొందరైతే ప్రశ్నించాల్సిన విపక్షం డీలా పడిందని,  అందుకే అధికార టీడీపీ, విపక్ష వైసీపీలను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోందని అంటున్నారు.

వైసీపీలో ఉన్నవారంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.  వారంతా బయటకు వస్తే వైసీపీ పనైపోవడం ఖాయం. ఈ క్రమంలో షర్మిల ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో ఉన్న గ్యాప్‌ని అందుకునే పనిలో పడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్.

 

Related News

AP free bus scheme: ఏపీలో ఫ్రీ బస్ రైడ్.. ఈ రూల్స్ మర్చిపోతే టికెట్ కట్టుడే!

MLA Madhavi Reddy: కుర్చీకోసం కలెక్టర్ పై ఎమ్మెల్యే ఫైర్.. చివరకు నిలబడే..

Pawan Kalyan: అప్పుడలా-ఇప్పుడిలా? వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ రుసరుస

Vadapalli: వాడపల్లి ఆలయానికి స్వాతంత్య్ర పోరాటానికి లింకేంటి?

AP Free Bus: నేటి నుంచే ఫ్రీ బస్సు.. APSRTC వారికి షాకింగ్ న్యూస్.. 15 రోజుల తర్వాతే..!

Big Stories

×