Ram Charan:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ (Ram Charan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు ఇతడు హీరో ఏంటి? అని అవమానించిన వారు చాలామంది ఉన్నారు.అలాంటి వారి అందరి నోరు మూయిస్తూ నేడు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఒక్కో సినిమాతో.. ఒక్కో మెట్టు ఎదుగుతూ తన స్టాండర్డ్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు రామ్ చరణ్.
రంగస్థలం సినిమాతో భారీ గుర్తింపు..
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాలు ఉన్నా.. నటన పరంగా అందరూ మెచ్చుకున్న చిత్రం ‘రంగస్థలం’ అనే చెప్పాలి. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు.. ముఖ్యంగా రామ్ చరణ్ నటన చూసి నేషనల్ అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు. అప్పటివరకు ఉన్న తెలుగు రీజినల్ రికార్డులు అన్నింటిని కూడా బ్రేక్ చేసింది ఈ సినిమా. అలా పాన్ ఇండియా రిలీజ్ చేయాల్సింది కానీ అనుకోని కారణాలవల్ల తెలుగుకే పరిమితమైంది.
రంగస్థలం 2కి సర్వం సిద్ధం..
ముఖ్యంగా అభిమానులు రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు రాలేదు అని చాలా బాధపడిపోయారు. అలాంటి అభిమానులకు ఇప్పుడు మంచి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా (Bucchibabu sana) దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సుకుమార్ తో సినిమా చేస్తున్నారు. అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అటు సుకుమార్ కూడా రామ్ చరణ్ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టేశారు. గతంలో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేసేటప్పుడు ఆ సినిమా లుక్ లో రామ్ చరణ్ తో సుకుమార్ ఒక ఫైట్ సీన్ కంపోజ్ చేసి పెట్టుకున్నాడట. ఆ లుక్కుతోనే కథ రాసుకుందాం అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ కి రంగస్థలం 2 ఆలోచన వచ్చిందట. ఇక అందులో భాగంగానే రంగస్థలం 2 సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా కథను రామ్ చరణ్ కి వినిపించబోతున్నట్లు సమాచారం.
అదే నిజమైతే బన్నీ తర్వాత స్థానం చరణ్ కే..
ఇక ఈ విషయం తెలిసి రామ్ చరణ్ అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. ఒకవేళ నిజంగానే సుకుమార్ , రాంచరణ్ కలిసి రంగస్థలం సినిమాకి సీక్వెల్ చేస్తే పాన్ ఇండియా వైడ్ సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా రామ్ చరణ్ కి కచ్చితంగా నేషనల్ అవార్డు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే నేషనల్ అవార్డు అందుకున్న తెలుగు హీరోలలో బన్నీ తర్వాత స్థానాన్ని రామ్ చరణ్ అందుకోబోతున్నారని చెప్పవచ్చు. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఏదేమైనా ఈ న్యూస్ మాత్రం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోందని చెప్పవచ్చు.
also read: Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?