E-Paper
Advertisement

Thanikaya: తగ్గని వ్యాధులను తగ్గించే తానికాయ.. ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Thanikaya: తగ్గని వ్యాధులను తగ్గించే తానికాయ.. ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Advertisement

Thanikaya: ఆయుర్వేదం ప్రకారం.. తానికాయ అనేక సమస్యలను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ తానికాయలకు ఆయుర్వేదంలో ప్రత్యేకస్థానం ఉంది. ఇవి భిన్న ర‌కాల ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. తానికాయల చూర్ణం తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొందవచ్చు. ఈ చూర్ణం ప‌లు వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తాయంటారు ఆయుర్వేద నిపుణులు. తరచూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేవాళ్లు తానికాయ‌ల‌ను ప‌లు ప‌దార్థాల‌తో క‌లిపి తీసుకుంటే.. తగ్గని రోగాలు కూడా తగ్గిపోతాయట. తానికాయ చూర్ణం తరచూ తీసుకుంటే.. శరీరంలోని చెడును మొత్తం తొలగించేస్తుందట.

సర్వ రోగాలకు విరుగుడు:

చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. జీర్ణక్రియ సరిగా లేకపోవడమే అనేక వ్యాధులకు మూల కారణం. ఈ తానికాయ చూర్ణం జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను సమతుల్యం చేస్తుంది. కడుపు సమస్యలను తగ్గించడంలో సాయపడుతుంది. దీంతోపాటు మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, తానికాయలను అతిగా తీసుకోకూడదు. అలా తీసుకుంటే.. శరీరం వేడికి గురవుతుంది.

శ్వాస స‌మ‌స్య‌ల‌కు దివ్యౌషధం:

Advertisement

తానికాయ‌ల క‌షాయంలో అశ్వగంధ చూర్ణం, బెల్లం క‌లిపి తీసుకుంటే వాతం త‌గ్గిపోతుంది. అలాగే తానికాయల చూర్ణంలో కొద్దిగా సైంధ‌వ ల‌వ‌ణం క‌లిపి తీసుకుంటే.. విరేచ‌నాలు క్ష‌ణాల్లో త‌గ్గుతాయి. ఈ కాయను అర‌గ‌దీసి ఆ మిశ్ర‌మాన్ని లేప‌నంగా రాస్తుంటే.. చ‌ర్మ వ్యాధులు దరిచేరవు. తానికాయల చూర్ణంలో తేనె క‌లిపి తీసుకుంటే ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా వంటి స‌మ‌స్య‌లు తగ్గిపోతాయి. ఈ చూర్ణం గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం క‌రిగిస్తుంది. తానికాయల పొడిలో కొద్దిగా చ‌క్కెర క‌లిపి రోజూ తింటే.. కంటి సంబంధించిన స‌మ‌స్య‌లు రావు.

Read Also: మొలకెత్తిన దుంపలు తింటున్నారా?.. ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!

ప్రశాంతమైన నిద్ర కోసం:

Advertisement

తానికాయ‌ల పొడిలో తేనె క‌లిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే.. గొంతులో నొప్పి, మంట‌ వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మనం పొందవచ్చు. అలాగే ఈ కాయలోని ప‌ప్పును రాత్రిపూట తింటే నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు. నిద్ర‌లేమి సమస్య క్రమంగా తగ్గుపోతుంది.

బోలెడు ప్రయోజనాలు:

* తానికాయ జుట్టు రాలడాన్ని నిలువరిస్తుంది. అంతేకాదు.. తెల్లజుట్టు సమస్యకు చక్కటి పరిష్కారం. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. తానికాయను సాధారణంగా ఆయుర్వేద నూనెలు, హెయిర్ ప్యాక్‌ల్లో ఉపయోగిస్తారు.
* ఊబకాయం, అధిక బరువు సమస్యలకు తానికాయ మంచి విరుగుడు. బరువు తగ్గాలనుకుంటే.. తానికాయ బెస్ట్ ఆప్షన్. ఇది తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో, బరువు తగ్గాలనుకునేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
* ముఖ్యంగా శీతాకాలంలో చాలామంది తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. అలాంటి వాళ్లు తానికాయను తీసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లతో పోరడటానికి, వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి సాయపడుతుంది.

Read Also: మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా.. మన బొడ్డులో పేరుకుపోయిన ఈ మెత్తటి పదార్థం ఏంటని?

Related News

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

Big Stories

Advertisement
×