E-Paper
Advertisement

Sreeleela : ఏంటి.. శ్రీలీల ‘ఉస్తాద్ ‘ కోసం అంత తీసుకుందా..?

Sreeleela : ఏంటి.. శ్రీలీల ‘ఉస్తాద్ ‘ కోసం అంత తీసుకుందా..?
Advertisement

Sreeleela : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ స్త్రీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వరుసగా స్టార్ హీరోలు సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంటుంది. అయితే ఇప్పటివరకు ఈమె ఎన్ని సినిమాలు చేసినా కూడా అన్నిట్లో ఏ ఒక్కటి కూడా మీకు స్టార్ ఇమేజ్ ని అందివ్వలేదు. కానీ వరుసగా సినిమాలు అయితే చేస్తూ వస్తుంది. సినిమాల హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీగానే వసూల్ చేస్తుందన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈమె నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా రెమ్యూనరేషన్ ఎక్కువగానే తీసుకుంటుందని టాక్. మరి ఆ మూవీకి ఎంత తీసుకుంటుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

Also Read : వీకెండ్ సినిమాల జాతర.. ఓటీటీలో వీటిని మిస్ చెయ్యకండి…

ఉస్తాద్ కోసం భారీ రెమ్యూనరేషన్..? 

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కు జోడిగా హీరోయిన్ శ్రీలీల నటిస్తుందన్న విషయం తెలిసిందే.. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులతో పాటుగా తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు.. ఈనెల ఉగాది కానుకగా 19వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించాలని ఎంతో మంది హీరోయిన్లు కోరుకుంటారు. అలాంటి అవకాశం యంగ్ బ్యూటీ శ్రీలీలకు దక్కింది.. అయితే ఈ సినిమా కోసం భారీగానే పారితోషికం పుచ్చుకుందట. సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ముద్దుగుమ్మ ఈ మూవీకి మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈమె ఇంత తీసుకోవడంపై సోషల్ మీడియాలో వార్త మాత్రం చక్కర్లు కొడుతుంది..

శ్రీలీల సినిమాల విషయానికొస్తే..

పెళ్లి సందడి అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది యంగ్ బ్యూటీ శ్రీలీల.. ఆ మూవీ సాలిడ్ హిట్ అందుకోకపోయినా సరే ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె వరుసగా సినిమాలు చేస్తూ ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.. చిన్న హీరోలతో సినిమాలు చేయడం మాత్రమే కాదు స్టార్ హీరోల సరసన కూడా హీరోయిన్గా నటించడంతో ఆమెకు క్రేజీ ఆఫర్లు అందుతున్నాయి. రామ్‌, నితిన్‌ లాంటి యంగ్‌ హీరోలతో పాటు మహేశ్‌ బాబు లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీలో ఐటమ్ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు తెలుగులో వరుసగా సినీ అవకాశాలు వస్తున్నా సరే అటు బాలీవుడ్ లోనూ ఇటు కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంటూ వచ్చింది. అక్కడ కూడా క్రేజీ హీరోయిన్ గా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×