E-Paper
Advertisement

LPG Delivery Scam: వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో మోసం.. నకిలీ మెసేజ్‌లతో దోపిడీ.. జాగ్రత్త

LPG Delivery Scam: వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో మోసం.. నకిలీ మెసేజ్‌లతో దోపిడీ.. జాగ్రత్త
Advertisement

LPG Cylinder Delivery Scam| దేశవ్యాప్తంగా ఇటీవల చాలా నగరాల్లో వంట గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ తీవ్ర కొరత కనిపిస్తోంది. గ్యాస్ పంపిణీ ఏజెన్సీల వద్ద జనం బారులు తీరుతున్నారు. వంట గ్యాస్ కొరత వల్ల ప్రజలు, హోటల్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని సైబర్ నేరస్థులు అవకాశంగా తీసుకుంటున్నారు. త్వరగా సిలిండర్ డెలివరీ చేస్తామని ఫేక్ మెసేజ్‌లు పంపుతున్నారు. గ్యాస్ రీఫిల్ త్వరగా జరగాలని ఎదురుచూస్తున్న వారినే సైబర్ దొంగలు టార్గెట్ చేస్తున్నారు.

ఎల్‌పీజీ డెలివరీ మోసం ఎలా జరుగుతుంది?

SMS, వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా మోసగాళ్లు మెసేజ్ పంపుతారు. “వెంటనే చెల్లించండి, రేపే గ్యాస్ డెలివరీ” అని మెసేజ్‌లో ఉంటుంది. మెసేజ్‌లో ఒక పేమెంట్ లింక్ ఇస్తారు. ఆ లింక్ అధికారిక గ్యాస్ కంపెనీదేనని నమ్మిస్తారు. త్వరగా గ్యాస్ కావాలని కోరుకునే వారు లింక్‌పై క్లిక్ చేసి వెంటనే డబ్బు చెల్లిస్తారు. పేమెంట్ పూర్తి అయిన వెంటనే సైబర్ మోసగాళ్లు అదృశ్యమవుతారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ ఎప్పుడూ జరగదు. ఎందుకంటే ఆ పేమెంట్ చేసిన డబ్బు మోసగాళ్ల ఖాతాలోకి వెళ్లిపోతుంది.

ఫేక్ వెబ్‌సైట్లు, యాడ్‌లతో ప్రజలకు వల

Advertisement

మోసగాళ్లు సోషల్ మీడియాలో ఫేక్ యాడ్‌లు పెడతారు. ఈ యాడ్‌లలో పెద్ద గ్యాస్ కంపెనీల లోగోలు ఉపయోగిస్తారు. అచ్చం అధికారిక బుకింగ్ వెబ్‌సైట్‌లాంటిదే నకిలీ వెబ్‌సైట్లు తయారు చేస్తారు. ఈ సైట్లు చూస్తే నిజమైనవిలా కనిపిస్తాయి. యూజర్లు పేమెంట్ లేదా కార్డ్ వివరాలు ఎంటర్ చేస్తే డబ్బు దొంగిలించబడుతుంది. బ్యాంక్ వివరాలు కూడా దొంగిలించబడవచ్చు.

హెచ్చరిక జారీ చేసిన గ్యాస్ కంపెనీలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్‌గ్యాస్, HP గ్యాస్ వంటి పెద్ద కంపెనీలు వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఆన్‌లైన్‌లో సిలిండర్ బుక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాయి. అధికారిక గ్యాస్ ఏజెన్సీలు లేదా కంపెనీలు ఎప్పుడూ లింక్‌ల ద్వారా అడ్వాన్స్ పేమెంట్ చేయమని అడగవు. గుర్తు తెలియని నెంబర్ల ద్వారా వచ్చే మెసేజ్‌లలో పేమెంట్ అడిగితే అది మోసమే అని హెచ్చరిస్తున్నాయి.

ఈ జాగ్రత్తలు పాటించండి

  • సిలిండర్ బుకింగ్ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారానే చేయండి.
  • మీ లోకల్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ రిజిస్టర్డ్ నంబర్ ద్వారానే బుక్ చేయండి.
  • గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లలో లింక్‌లపై క్లిక్ చేయవద్దు.
  • అనుమానాస్పద వెబ్‌సైట్లలో పేమెంట్ చేయవద్దు.
  • వెబ్‌సైట్ అడ్రస్ జాగ్రత్తగా చూడండి. అధికారిక వెబ్‌సైట్ అడ్రస్ బాగా చెక్ చేసుకోండి.
  • OTP, బ్యాంక్ వివరాలు, కార్డ్ సమాచారం ఎవరికీ ఇవ్వకూడదు.
  • బ్యాంక్ యాప్‌లో ట్రాన్సాక్షన్ అలర్ట్స్ ఆన్ చేయండి.
  • అనుమానాస్పదంగా ఉంటే వెంటనే బ్యాంక్, పోలీసులకు ఫిర్యాదు చేయండి.
Advertisement

Also Read: మనుషులపై జోకులు వేసే ఏఐలు.. మానవులకు నో ఎంట్రీ ప్లాట్‌ఫామ్.. చాలా ప్రమాదకరం

డిజిటల్ పేమెంట్ మోసాలపై ఆందోళన

డిజిటల్ పేమెంట్లు సులభంగా, వేగంగా ఉంటాయి. అందుకే ఈ ప్రిక్రియను సైబర్ నేరస్థులు దుర్వినియోగం చేస్తున్నాయి. ఎమర్జెన్సీ సమయాల్లో మోసాలు ఎక్కువవుతాయి. ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మెసేజ్‌లు పంపే నెంబర్లు, వెబ్‌సైట్లను సరిచూసుకొని, అనుమానాస్పద లింక్‌లను నివారిస్తే డబ్బు, పర్సనల్ డేటాను రక్షించుకోవచ్చు.

 

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×