E-Paper
Advertisement

CPI Protest: దేశంలో గ్యాస్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఆయనే..?

CPI Protest: దేశంలో గ్యాస్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఆయనే..?
Advertisement

CPI Protest: స్వేచ్ఛ బ్యూరో: అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, భారత్ లో మోడీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు సతమతవుతున్నారనీ, ఇందుకు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, కేంద్రంలో మోదీ సర్కార్ విధాన వైఫల్యాలే కారణమని అన్నారు.

పాఠశాలలపై క్షిపణి దాడులు

ఇరాన్ తమపై దాడి చేయకుండా ముందస్తు దాడి చేస్తున్నామనే పొంతనలేని సాకుతో ఇజ్రాయెల్, ఇరాన్ నాయకత్వాన్ని మార్చాలని కుటిల నీతితో అమెరికా ఆ దేశంపై ఫిబ్రవరి 28న ఏకపక్షంగా బాంబుల వర్షం కురిపించిందని, అత్యంత బాధాకరంగా పిల్లలలు చదుకునే పాఠశాలలపై క్షిపణి దాడుల చేసి 165 మంది చదువుకునే అమ్మాయిలు, టీచర్లను పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రమైందన్నారు. బ్యారెల్ ధర రూ.100 దాటిందని, ఫలితంగా దేశంలో గృహ అవసరాల గ్యాస్ ధరలు రూ.60కి పెరిగిందని అన్నారు.

Advertisement

Also Read: KTR: మూసీ పునరుజ్జీవనం పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..!

నరేంద్ర మోడీప్రభుత్వం

పెట్రోల్, గ్యాస్ కొరత లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు అబద్ధమన్నారు. గ్యాస్ సరఫరా తగ్గి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హోటల్స్ ముతపడుతున్నాయని, దీనికి ప్రధాని నరేంద్ర మోడీప్రభుత్వం అమెరికాకు లొంగిపోవడమే కారణం అని పేర్కొన్నారు. నిరసనల్లో ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని యుద్ధాన్ని ఆపాలని, ప్రపంచ శాంతిని పరిరక్షించాలని, భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పునరుద్ధరించాలని చాటాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also Read: Bhatti Vikramarka: ఉపాధి హామీ పథకం కింద మెడిసినల్ ప్లాంట్స్: భట్టివిక్రమార్క

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×