E-Paper
Advertisement

‘పెద్ది’ పర్సంటేజీ వివాదానికి మెగా ఎండ్ కార్డ్.. చిరంజీవి ఎంట్రీతో సీన్ రివర్స్!

‘పెద్ది’ పర్సంటేజీ వివాదానికి మెగా ఎండ్ కార్డ్.. చిరంజీవి ఎంట్రీతో సీన్ రివర్స్!
Advertisement

Peddi Dispute: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత కొన్ని వారాలుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ‘పెద్ది’ సినిమా ప్రదర్శన వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య పర్సంటేజీ పద్ధతి వర్సెస్ రెంటల్ విధానంపై నడుస్తున్న కోల్డ్ వార్‌ కి  మెగాస్టార్ చిరంజీవి ఎండ్ కార్డ్ వేసేశాడు.

డైలామాకి ఎండ్ కార్డ్

Advertisement

జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం విడుదల అవుతుందా లేదా అన్న డైలామాకి ఎండ్ కార్డ్ పడటంతో ఊపిరి పీల్చుకున్నాయి ట్రేడ్ సర్కిల్స్.చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో థియేటర్ల అద్దె (రెంటల్ సిస్టమ్) విధానమే నడుస్తోంది. కానీ ఈ మధ్య కాలంలో థియేటర్ల మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోవడంతో కలెక్షన్లలో పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీనికి నిర్మాతలు అస్సలు ఒప్పుకోకపోవడంతో వివాదం ముదిరింది. ‘పెద్ది’ సినిమా విడుదల దగ్గరకొచ్చేకొద్ది ఈ కాంట్రవర్సీ కలెక్షన్లపై ఎక్కడ దెబ్బకొడుతుందో అని అంతా ఆందోళన పడ్డారంతా.

Also read :Big Tv Kissik Talks: కన్నీళ్లు తెప్పిస్తున్న శివ స్టోరీ.. ప్రియాంక జైన్ తో పెళ్లి పై క్లారిటీ…

Advertisement

అదనంగా 7.5 శాతం మొత్తం ఎగ్జిబిటర్లకు

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.దీంతో ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ ఇచ్చే నివేదికకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని, అప్పటివరకు ఇండస్ట్రీ ప్రయోజనాలను దెబ్బతీయవద్దని ఆయన ఎగ్జిబిటర్లకు సూచించారు. దీంతో చిరంజీవి మాటను గౌరవిస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్లు ఒక  నిర్ణయానికి వచ్చారు.

దీని ప్రకారం ‘పెద్ది’ చిత్రాన్ని ఎప్పటిలాగే పాత పద్ధతి అయిన రెంటల్ విధానంలోనే ప్రదర్శించనున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందండోయ్. ఒకవేళ ఈ సినిమాకు ఎక్కడైనా టికెట్ రేట్లు పెంచితే మాత్రం, సదరు థియేటర్ల రెంట్‌తో పాటు అదనంగా 7.5 శాతం మొత్తాన్ని ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సాధారణ రేట్లకే ప్రదర్శిస్తే మాత్రం కేవలం అద్దె మాత్రమే వర్తిస్తుంది.

అందరి దృష్టి  ‘పెద్ది’ సృష్టించబోయే కలెక్షన్లపై 

ఈ నిర్ణయం కేవలం ‘పెద్ది’ సినిమాకే కాకుండా రాబోయే మరికొన్ని పెద్ద సినిమాల రిలీజ్ లైనప్‌కు కూడా ఒక రూట్ మ్యాప్ సెట్ చేసిందనే చెప్పాలి.అయితే పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు పూర్తిగా వెనక్కి తగ్గలేదు. కేవలం జూన్ నెలలో వచ్చే సినిమాలకు మాత్రమే ఈ మినహాయింపు ఇచ్చారు. జూన్ 30 తర్వాత థియేటర్లలోకి వచ్చే ప్రతి సినిమాను ఖచ్చితంగా పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ గట్టిగా తీర్మానించింది.

Also read :హాస్టల్ లైఫ్ బ్యాక్‌డ్రాప్‌లో క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్.. ఘనంగా ప్రారంభమైన ‘లఫూట్ గ్యాంగ్’!

అంటే రాబోయే రోజుల్లో టాలీవుడ్ లోని మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాల మేకర్స్ ఈ కొత్త రూల్ కి అనుగుణంగా చర్చలు జరపాల్సి ఉంటుంది.ఏది ఏమైనా వివాదాలన్నీ ముగిసిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి జూన్ 4న థియేటర్లలో ‘పెద్ది’ సృష్టించబోయే కలెక్షన్ల సునామీపైనే ఉందని చెప్పకతప్పదు .

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×