E-Paper
Advertisement

Big Tv Kissik Talks: ఆ రోజు నుంచి ఆయనపై పిచ్చి పెరిగిపోతోంది.. జ్యోతి ఊహించని కామెంట్స్!

Big Tv Kissik Talks: ఆ రోజు నుంచి ఆయనపై పిచ్చి పెరిగిపోతోంది.. జ్యోతి ఊహించని కామెంట్స్!
Advertisement

Big Tv Kissik Talks:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ టాక్ షోలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.. ఒక్కో ఛానల్ సొంతంగా ఒక టాక్ షో నిర్వహిస్తూ.. సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ వారికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్ షో కార్యక్రమానికి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ షో కి ప్రముఖ జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన ఎపిసోడ్ లో ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి జ్యోతి (Actress Jyothi)హాజరయ్యింది. ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్న ఆమె.. తాజాగా ఒక హీరో పై మనసు పారేసుకోవడమే కాకుండా ఆ రోజు నుంచే ఆయనపై పిచ్చి పెరిగిపోతుంది అంటూ చెప్పి ఆశ్చర్యపరిచింది.

పవన్ కళ్యాణ్ పై మనసు పారేసుకున్న జ్యోతి..

విషయంలోకి వెళ్తే.. పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించి, భారీ పాపులారిటీ అందుకున్న జ్యోతి ‘పెళ్ళాం ఊరెళితే’ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడమే కాకుండా.. ఇందులోని తన పాత్రతో స్టార్ గా ఫేమ్ ను సొంతం చేసుకుంది. కొన్నాళ్లు సినిమాలకు దూరమైన ఈమె.. మళ్లీ బిగ్ బాస్ రియాలిటీ షో తో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె అడపాదడపా అవకాశాలు కూడా అందుకుంటూ బిజీగా మారింది. అలాంటి ఈమె తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి విచ్చేసి.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఉన్న తన ఇష్టాన్ని పంచుకుంది.

వచ్చే జన్మంటూ ఉంటే ఆయనకే భార్యగా..

Advertisement

జ్యోతి మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయనతో నేను గుడుంబా శంకర్ సినిమా చేశాను. అప్పుడే ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన సరదాగా ఆటపట్టించేవాళ్ళు. అయితే ఆయన పాలిటిక్స్ కి వెళ్తారు.. డిప్యూటీ సీఎం అవుతారు అని మాత్రం నేను ఊహించలేదు. రీసెంట్గా కలిశాను.. మా బాబును పరిచయం చేస్తే ఏంటి నీ కొడుకా ఇంత పెద్దోడు అయ్యాడు అని ఆయన ఆశ్చర్యపోయారు. నేను జనసేన పార్టీనే. ఆయన ఏ చిన్న ప్రాంతానికైనా వెళ్లి అక్కడ సమస్యలు తెలుసుకుని దానిపై పనిచేస్తారు. నిజానికి ఆయన అంటే నాకు క్రష్. ఇంకో జన్మ ఉంటే కచ్చితంగా ఆయనే నా భర్తగా రావాలి.. నేనే ఆయన భార్యగా వెళ్లాలి అని కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ పై తన అభిప్రాయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది జ్యోతి. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

also read:Bigg Boss 9 Promo: రీతూకి బంపర్ ఆఫర్ ఇచ్చిన చైతూ.. మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటో?

పవన్ కళ్యాణ్ కెరియర్..

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలోనే తన నటనతో పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు విడుదల చేయకపోయినా.. తన మేనరిజం తో.. స్టైల్ తో.. పెర్ఫార్మెన్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు రాజకీయ నాయకుడిగా కూడా చలామణి అవుతూ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో నటిస్తున్నారు.

Related News

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

Big Stories

Advertisement
×