E-Paper
Advertisement

Kuppam Crime: కుప్పంలో ‘దృశ్యం’ సీన్.. వ్యక్తిని చంపేసి ఇంట్లోనే పాతిపెట్టారు, రంగంలోకి పోలీసులు

Kuppam Crime: కుప్పంలో ‘దృశ్యం’ సీన్.. వ్యక్తిని చంపేసి ఇంట్లోనే పాతిపెట్టారు, రంగంలోకి పోలీసులు
Advertisement

Kuppam Crime: ఈ మధ్యకాలం చాలా ప్రాంతాల్లో ‘దృశ్యం’ మూవీ సీన్ రిపీట్ అవుతున్నాయి. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. ఆ తరహా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కుప్పంలో అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిని చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టారు. విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

కుప్పంలో ‘దృశ్యం’ సీన్

Advertisement

కుప్పంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుప్పం మున్సిపాలిటీలోని అమరావతి కాలనీలో ఈ ఘటన జరిగింది. మృతుడు బెంగుళూరుకి చెందిన శ్రీనాథ్‌గా గుర్తించారు. అక్టోబర్ 27 నుండి శ్రీనాథ్ ఆచూకీ కనిపించ లేదు. శ్రీనాథ్‌ని హత్య చేసిన తర్వాత ఎవరూ లేని ఇంట్లో డెడ్ బాడీని పూడ్చి పెట్టారు. ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనాథ్‌ని ప్రభాకర్ హత్య చేసినట్లు సమాచారం.

బెంగుళూరు‌కు‌ చెందిన శ్రీనాథ్ ఫైనాన్స్ వ్యాపారి. అతడు కుప్పం ప్రాంతానికి చెందిన ప్రభాకర్‌కు అప్పు ఇచ్చాడు. అర్జెంటు పని ఉందని చెప్పి రూ. 40 లక్షలు తీసుకున్నాడు. వారం రోజుల్లో ఇస్తానని చెప్పాడు. నిజమేనని నమ్మి శ్రీనాథ్ ఇచ్చాడు. ఆ తర్వాత రకరకాలు మాయ మాటలు చెప్పడం మొదలుపెట్టారు ప్రభాకర్.

Advertisement

వ్యక్తిని చంపేసి ఇంట్లోనే పాతిపెట్టారు

బెంగుళూరు నుంచి వచ్చిన ప్రతీసారీ తన పరువు తీస్తున్నాడని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్టోబర్ 27న శ్రీనాథ్ బెంగుళూరు నుంచి కుప్పం ప్రాంతానికి వచ్చాడు. శ్రీనాథ్-ప్రభాకర్ మధ్య ఏం జరిగిందో తెలీదు. అప్పు ఇచ్చి తిరిగి అడిగిన పాపానికి దారుణంగా హత్య చేశాడు ప్రభాకర్. వారం రోజులుగా శ్రీనాథ్ ఇంటికి రాకపోవడంతో బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శ్రీనాథ్ ది మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేశారు. కర్నాటక-ఏపీ పోలీసుల విచారణలో శ్రీ‌నాథ్ హత్యకు గురైనట్లు తేలింది. కుప్పం మున్సిపాలిటీ లోని అమరావతి కాలనీలో కొత్తగా నిర్మించిన ఇంట్లో శ్రీనాథ్‌ని చంపి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు ప్రభాకర్. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు అటువైపు దృష్టి పెట్టారు. దీంతో ఓ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ALSO READ:  లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లో 8 మంది

ప్రస్తుతం నిందితుడు ప్రభాకర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాకర్‌పై హత్య కేసు నమోదు అయ్యింది. కొత్త ఇంట్లో డెడ్‌బాడీని బయటకు తీశారు పోలీసులు. పోస్టుమార్టం- ఫోరెన్సిస్ బృందాలు అక్కడికి చేరుకుని పరీక్షలు నిర్వహించాయి. మరి రిపోర్టులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×