Sri Lanka vs Zimbabwe: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో జింబాబ్వే మరో సంచలనం విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టును మట్టి కల్పించిన జింబాబ్వే, తాజాగా శ్రీలంక నడ్డి విరిచింది. ఇవాళ గ్రూప్ స్టేజ్ లో జరిగిన చివరి మ్యాచ్ లో అద్భుతంగా ఆడింది జింబాబ్వే. శ్రీలంకపై ఏకంగా ఆరు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. శ్రీలంక వర్సెస్ జింబాబ్వే ( Sri Lanka vs Zimbabwe) మధ్య ఇవాళ కొలంబోలోని ప్రేమ దాస స్టేడియం ( R.Premadasa Stadium, Colombo) వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 178 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఫినిష్ చేసి విజయం సాధించింది జింబాబ్వే. దీంతో జింబాబ్వే విజయంపై సోషల్ మీడియాలో పోస్టులు మారుమోగుతున్నాయి. మొన్నా కంగారులను కంగారు పెట్టిన జింబాబ్వే.. ఇవాళ శ్రీలంకకు మూడు చెరువుల నీళ్లు తాగించిందని సోషల్ మీడియాలో ఫాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో గ్రూప్ బి లో ఉన్న జింబాబ్వే సంచలన విజయాలు నమోదు చేసుకుంటుంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే సూపర్ 8 లోకి దూసుకు వెళ్లిన జింబాబ్వే… మొదట ఆస్ట్రేలియన్ ఓడించగా తాజాగా శ్రీలంకను చిత్తు చేసింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన జింబాబ్వే మూడు విజయాలు నమోదు చేసుకొని గ్రూపు బిలో టాప్ పొజిషన్ లోకి వెళ్ళింది. ముఖ్యంగా ఫిబ్రవరి 13వ తేదీన జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది జింబాబ్వే. ఇక ఇవాళ కొలంబో వేదికగా జింబాబ్వే ( Zimbabwe) మరో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. హోమ్ గ్రౌండ్ లోనే శ్రీలంకను చిత్తు చేసింది.
ఇవాళ ప్రేమ దాస స్టేడియం వేదికగా శ్రీలంక వర్సెస్ జింబాబ్వే మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని జింబాబ్వే 19.3 ఓవర్లలో చేదించింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది జింబాబ్వే. ఇక ఈ మ్యాచ్ లో సికిందర్ రాజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఇదే జింబాబ్వే సూపర్ 8 లో టీమిండియాతో కూడా తలపడనుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వే కోసం సరికొత్త ప్లాన్స్ టీమిండియా సెట్ చేసుకోవాలి.
🚨 SIKANDAR RAZA – THE ZIMBABWEAN LEGEND 🚨
– Sikandar Raza is the top T20I All-Rounder, just behind Saim Ayub.
– He is the captain of the Zimbabwe Cricket Team in the T20 World Cup (since November 2023).
– Beat Pakistan in the T20 World Cup 2022 in Australia.
– Led Zimbabwe… pic.twitter.com/Vllv6xEEUm
— Rayham (@RayhamUnplugged) February 19, 2026