E-Paper
Advertisement

Child Rights: బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథం ప్రారంభించిన అదనపు కలెక్టర్ భాస్కరరావు

Child Rights: బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథం ప్రారంభించిన అదనపు కలెక్టర్ భాస్కరరావు
Advertisement

Child Rights: భువనగిరి బ్యూరో, స్వేచ్ఛ: స్కోప్ స్వచ్ఛంద సంస్థ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు కట్టుబడి, బాలల హక్కుల పరిరక్షణ దిశగా ఒక కీలక ముందడుగు వేస్తూ బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథానీ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం సమాజంలో బాల్య వివాహాలపై అవగాహన పెంపొందించడం, బాలికల విద్య మరియు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, చట్టపరమైన చర్యలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడం లక్ష్యంగా నిర్వహించబడుతోంది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

Also Read: Huzurabad Hospital: హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల తీవ్ర ఇబ్బందులు .. పట్టించుకోని అధికారులు!

తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి 

Advertisement

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య మరియు  భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ప్రచార రథం ద్వారా గ్రామాలు, మండలాలు, పాఠశాలలు, కాలేజీలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. బాల్య వివాహాల నిషేధానికి సంబంధించిన చట్టాలు, ముఖ్యంగా ప్రొవిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి ప్రజలకు వివరించబడుతుంది. అలాగే, బాల్య వివాహాల సమాచారాన్ని తెలియజేయడానికి ఉపయోగపడే చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ నిర్వహించే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ సేవల గురించి కూడా విస్తృత ప్రచారం చేయబడుతుంది.

బాలల పరిరక్షణ

ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ, విద్యాశాఖ, కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలో బాల్య వివాహాలపై అవగాహన పెంపొందించి, ప్రతి బాలికకు విద్య, ఆరోగ్యం మరియు సురక్షిత బాల్యాన్ని అందించాలనే సంకల్పంతో ఈ ప్రచార యాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు , బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ అనంతలక్ష్మి , స్కోప్ కోఆర్డినేటర్ సోమ నరసయ్య ,సిడబ్ల్యూ సి మెంబర్ శివరాజ్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ దశరథ, హబ్ కో ఆర్డినేటర్ హర్ష, సీనియర్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్కోప్ సంస్థ ప్రతినిధులు నరసింహారాజు, అశ్విని, వెంకటేష్ , బాల రక్ష పాల్గొన్నారు. కలెక్టర్ భాస్కర్ రావు ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

Advertisement

Also Read: OpenAI – TCS Deal: ఏఐ రంగంలో టాటా సంచలనం.. చాట్ జీపీటీ మాతృ సంస్థతో.. టీసీఎస్ బిగ్ డీల్

Related News

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

1980s ట్రెండ్.. అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్

అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం

మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

ఏఐసీసీలో తెలంగాణకు ప్రయార్టీ.. మధుయాష్కీకు కీలక పదవి, ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ హైకమాండ్ నియామకం

Big Stories

Advertisement
×