E-Paper
Advertisement

Ibomma-Immadi Ravi: నాంపల్లి కోర్టుకు ఐ బొమ్మ ఇమ్మడి రవి.. నిర్మాతలు ఊపిరి పీల్చుకోండి!

Ibomma-Immadi Ravi: నాంపల్లి కోర్టుకు ఐ బొమ్మ ఇమ్మడి రవి.. నిర్మాతలు ఊపిరి పీల్చుకోండి!
Advertisement

Ibomma -Immadi Ravi: సినిమా పైరసీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఐ బొమ్మ(Ibomma) నిర్వాహకుడు ఇమ్మాడి రవి(Immadi Ravi)ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం ఆయన విదేశాల నుంచి తిరిగి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్ పోలీసులు సినిమా పైరసీలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐ బొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి కదలికలపై నిగా పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు నేడు తనని అదుపులోకి తీసుకున్నారు.

నాంపల్లి కోర్టుకు ఇమ్మడి రవి..

ఇలా సైబర్ క్రైమ్ విచారణలో భాగంగా ఇమ్మాడి రవి నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరి కాసేపట్లో ఇతనిని నాంపల్లి కోర్టు(Nampally Court)లో హాజరుపరచునున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఇమ్మడి రవి నుంచి ఐ బొమ్మ సర్వర్ వెబ్ సైట్ల పై కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఈయన నుంచి కొన్ని వందల హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇమ్మడి రవి వైజాగ్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు అయితే ఈయన కూకట్ పల్లిలో ఓ అపార్ట్మెంట్లో ఉన్నట్టు తెలుస్తోంది.

వందల సంఖ్యలో పైరసీలు..

Advertisement

ఈయన నివసించే అపార్ట్మెంట్ లో పెద్ద మొత్తంలో కంప్యూటర్లతో పాటు హార్డ్ డిస్క్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈయన వ్యక్తిగతంగా వాడిన సర్వర్లను కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ విచారణలో భాగంగా ఇమ్మడి రవి వందల సినిమాల పైరసీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.. ఇలా వందల సంఖ్యలో సినిమాలను పైరసీలకు అమ్మేయడంతో భారీగా సొమ్ము చేసుకున్నారని కూడా తెలుస్తోంది.

పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ..

Advertisement

ఇలా పోలీసు విచారణలో భాగంగా ఇమ్మాడి రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టిన అనంతరం సైబర్ క్రైమ్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరు పరచనుంది. మరి కోర్టు నుంచి ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందో తెలియాల్సి ఉంది. ఇలా సినిమా పైరసీ తిమింగలం పోలీసులకు చిక్కడంతో నిర్మాతలకు ఎంతో ఉపశమనం లభించిందని చెప్పాలి. ఈ విధంగా సినిమా పైరసీలకు పాల్పడటం ద్వారా సినిమా ఇండస్ట్రీకి వందల కోట్లు నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. ఇకపోతే గత రెండు సంవత్సరాల క్రితం ఐ బొమ్మ పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దమ్ముంటే పట్టుకోవాలంటూ ఛాలెంజ్ చేయగా అప్పటినుంచి పోలీసులు రవి పై స్పెషల్ ఫోకస్ పెట్టి ఆయన ప్రతి ఒక కదలికలను గుర్తిస్తూ పక్కా పథకం ప్రకారమే నేడు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Uppal Balu – Janhvi Kapoor: షాక్ అయ్యారా… ఉప్పల్ బాలు డ్యాన్స్‌ వీడియోను షేర్ చేసిన జాన్వీ కపూర్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×