E-Paper
Advertisement

Huawei Mate 80: 20GB RAM గల సూపర్ స్పీడ్ ఫోన్ వచ్చేస్తోంది.. హవాయ్ మేట్ 80 సిరీస్ లాంచ్‌కు సిద్ధం

Huawei Mate 80: 20GB RAM గల సూపర్ స్పీడ్ ఫోన్ వచ్చేస్తోంది.. హవాయ్ మేట్ 80 సిరీస్ లాంచ్‌కు సిద్ధం
Advertisement

Huawei Mate 80| చైనా టెక్ దిగ్గజం హవాయ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయబోతోంది. ఈ సిరీస్‌లో ఒక ఫోన్‌కు 20GB ర్యామ్ ఉంటుంది. ఇప్పటివరకు ఏ ఫోన్‌లోనూ ఇంత ర్యామ్ లేదు. ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ ఫోన్లు అన్నీ కేవలం 16GB ర్యామ్‌తోనే ఉన్నాయి. మేట్ 80 సిరీస్‌తో హవాయ్ ఈ రంగంలో కొత్త రికార్డు సృష్టించబోతోంది.

20GB ర్యామ్‌తో అద్భుతమైన మల్టీటాస్కింగ్

20GB ర్యామ్ అంటే ఒకేసారి చాలా యాప్‌లు తెరిచి పని చేయవచ్చు. భవిష్యత్తులో వచ్చే భారీ యాప్‌లకూ ఈ ఫోన్ అడ్వాన్స్ సిద్ధంగా ఉంటుంది. ఇది ఫోన్‌ను ఎక్కువ కాలం ఉపయోగకరంగా మారుస్తుంది.

Advertisement

నాలుగు మోడల్స్
మేట్ 80 సిరీస్‌లో నాలుగు వేరియంట్స్ రావచ్చు.

  • మేట్ 80 బేస్ మోడల్
  • మేట్ 80 ప్రో
  • మేట్ 80 ప్రో మాక్స్ (కొత్త మోడల్)
  • మేట్ 80 RS మాస్టర్ ఎడిషన్ (అత్యంత ఖరీదైనది)

గతంలో ప్రో+ అనే పేరు ఉండేది, ఇప్పుడు దాని స్థానంలో RS మాస్టర్ ఎడిషన్ రాబోతోంది.

కొత్త కిరిన్ 9030 చిప్‌సెట్

Advertisement

హువావే కొత్త కిరిన్ 9030 ప్రాసెసర్‌ను తయారు చేస్తోంది. ఇది పాత చిప్‌ల కంటే చాలా వేగవంతంగా, శక్తి ఆదా చేస్తుంది. నాలుగు మోడల్స్‌లోనూ ఈ చిప్ ఉండవచ్చు. గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి భారీ పనులు సులువుగా చేయవచ్చు.

కూలింగ్ సిస్టమ్ – ఫ్యాన్ లాంటిది

ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు లోపల చిన్న ఫ్యాన్ లాంటి కూలింగ్ సిస్టమ్ ఉండవచ్చు. ఇది సాధారణ ఫోన్లలో చాలా అరుదు. ఎక్కువసేపు గేమ్ ఆడినా, భారీ పని చేసినా చిప్ పూర్తి స్పీడ్‌లో పనిచేస్తుంది.

సెక్యూరిటీ ఫీచర్స్

అన్ని మోడల్స్‌లోనూ 3D ఫేస్ రికగ్నిషన్ ఉంటుంది – ఇది ప్రీమియం ఫీచర్. అలాగే సైడ్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. మీ డేటా సురక్షితంగా ఉంటుంది.

లాంచ్ డేట్

నవంబర్ 25న ఈ సిరీస్ లాంచ్ అవుతుందని పుకార్లు. హవాయ్ ఇంకా అధికారికంగా చెప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్ ఉండవచ్చు.

మార్కెట్‌పై ప్రభావం

మేట్ 80 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ప్రమాణాలను మార్చవచ్చు. ఇతర కంపెనీలు కూడా ఎక్కువ ర్యామ్ ఫోన్లు తీసుకురావచ్చు. కస్టమర్లకు మరింత పవర్‌ఫుల్ ఆప్షన్లు లభిస్తాయి.

అధికారిక ప్రకటన త్వరలో

ఇవన్నీ లీక్‌లు మాత్రమే. హవాయ్ త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించబోతోంది. అడ్వాన్స్ టెక్ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ ఈ ఫోన్ కోసం ఆసక్తిగా ఉన్నారు.

Also Read: గేమింగ్, చార్జింగ్ సమయంలో కాలిపోతున్న ఫోన్లు.. ఈ జాగ్రత్తలు పాటించండి

Related News

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×