E-Paper
Advertisement

Pawan Kalyan: ఐబొమ్మ రవి అరెస్ట్.. సీ.పీ సజ్జనార్ కు పవన్ స్పెషల్ థాంక్స్!

Pawan Kalyan: ఐబొమ్మ రవి అరెస్ట్.. సీ.పీ సజ్జనార్ కు పవన్ స్పెషల్ థాంక్స్!

Pawan Kalyan: ఐ బొమ్మ రవి(IBomma Ravi) అరెస్టు కావడంతో మూవీ పైరసీకి అడ్డుకట్టు వేసినట్లేనని అందరూ భావిస్తున్నారు. గత కొంతకాలంగా సినిమాలను పెద్ద ఎత్తున పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమకు నష్టాలను తీసుకురావడమే కాకుండా సినిమాల పైరసీ ద్వారా రవి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా పైరసీపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఐబొమ్మ నిర్వాహకుడు రవిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఇక ఈ విషయం గురించి సి.పీ.సజ్జనార్ ప్రెస్ మీట్ నిర్వహించి కీలక విషయాలను వెల్లడించారు.

పైరసీ వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం..

ఇక ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున చిరంజీవి, దిల్ రాజు, సురేష్ బాబు, రాజమౌళి వంటి తదితరులు పాల్గొన్నారు. ఐ బొమ్మ రవి అరెస్ట్ విషయం పట్ల నటుడు పవన్ కళ్యాణ్ సజ్జనార్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ విషయంపై స్పందిస్తూ.. సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు సిటీ కమిషనర్ శ్రీ వి.సీ సజ్జనార్ (V.C.Sajjanar) కి అభినందనలు. డబ్బుల రూపంలోనే కాదు సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలు విడుదలైన మొదటి రోజే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న వారి వల్ల చిత్ర పరిశ్రమ ఎంతగానో నష్టపోయిందని తెలిపారు.

పోలీసులకే ఛాలెంజ్..

ఇటీవల కాలంలో సినిమాని విడుదల చేయడమే ఒక మహా యజ్ఞంలో మారిపోయింది. ఇలాంటి తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కావడం లేదు. ఇలా పైరసీ ముఠాలో కీలకంగా ఉన్న ఐ బొమ్మ, బప్పం వెబ్ సైట్ ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేయటమే కాకుండా ఆయన చేత ఈ వెబ్ సైట్ మూయించి వేయడం ఎంతో స్వాగతించదగ్గ పరిణామం అని తెలిపారు. ఇటీవల కాలంలో పైరసీ ముఠాలు పోలీసులకే చాలెంజ్ విసిరే స్థాయికి చేరుకున్నారు. ఇలాంటి తరుణంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన ఆపరేషన్ ఎంతో విజయవంతం అయ్యింది.

ఈ ఆపరేషన్ లో భాగమైన పోలీసులకు, సిటీ కమిషనర్ సజ్జనార్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను బెట్టింగ్ మాఫియా ఫోన్ జీ స్కీమ్స్ లాంటి వాటిపై మరింత దృష్టి సారించి వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయో తెలియజేస్తూ వారిని చైతన్య పరుస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కట్టడి చేయటంలో సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం ఇతర రాష్ట్రాలలో కూడా కదలికలను తీసుకువచ్చిందని, సజ్జనార్ గారి నేతృత్వంలో చేపట్టే చర్యలు ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు కలగచేస్తాయి అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైన ట్వీట్ చేస్తూ సజ్జనార్ కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Also Read: Raj Tarun: నేను స్ప్రింగ్ లాంటోడిని.. ఎంత తొక్కితే అంత పైకి లేస్తా.. రాజ్ తరుణ్

Related News

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

Big Stories

×