Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun)ఇటీవల పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అయితే ఇటీవల రాజ్ తరుణ్ సినిమాల కంటే కూడా తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈయన లావణ్య(Lavanya) అనే అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకొని తనని మోసం చేశారు అటు లావణ్య ఆరోపణలు చేయడంతో ఈ ఆరోపణల ద్వారా వివాదంలో చిక్కుకొన్నారు. ఇక ఈ విషయంలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, కోర్టుకు వెళ్లడం వంటి సంఘటనలు జరిగాయి. ఇప్పటికీ ఈ విషయం గురించి ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంది.
తాజాగా ఈ వ్యాఖ్యల పట్ల నటుడు రాజ్ తరుణ్ “పాంచ్‌మినార్”(Paanch Minar) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా స్పందించారు.. ఈ సినిమా వేడుకలో భాగంగా ఈయన మాట్లాడుతూ.. నన్ను చాలామంది చాలా సందర్భాలలో మాట్లాడమని చెప్పారు నేను మాట్లాడలేదు అంటే నా దగ్గర సమాధానం లేక కాదు. తిరిగి వెనక్కి చూసుకోవడం ఇష్టం లేక అని తెలిపారు. నాకు సంబంధించిన విషయాలలో నా ప్రమేయం లేకుండా చాలా జరుగుతున్నాయి. నేను చేయగలిగింది మాత్రం ఈ విషయాలన్నీ గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమేనని తెలిపారు.
చాలామంది నన్ను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది తొక్కిన పరవాలేదు నేను స్ప్రింగ్ లాంటి వాడిని తిరిగి అంతే పైకి లేస్తాను అంటూ లావణ్య వివాదం గురించి పరోక్షంగా రాజ్ తరుణ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాజ్ తరుణ్ విషయంలో లావణ్య చేసిన ఆరోపణలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈమె చేస్తున్న వ్యాఖ్యల కారణంగా రాజ్ తరుణ్ కెరియర్ పై తీవ్రమైన ప్రభావం పడుతుందని చెప్పాలి. ఇలా తన చుట్టూ ఇన్ని వివాదాలు ఉన్నప్పటికీ రాజ్ తరుణ్ మాత్రం కెరియర్ పై ఫోకస్ పెడుతూ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
అంచనాలు పెంచిన ట్రైలర్..
ఇక తాజాగా ఈయన నటించిన పాంచ్‌మినార్ సినిమా నవంబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్, రాశీ సింగ్ (Rashi Singh)జంటగా నటించగా ఈ సినిమాకు రామ్ కడుముల(Ram Kudumula) దర్శకత్వం వహిస్తున్నారు. కనెక్ట్ మూవీస్ బ్యానర్ పై గోవిందా రాజులు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేశారు. ఇలా విడుదల చేసిన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో కూడా తన పాత్ర చూసి అందరూ బాగా నవ్వుకుంటారని అందరిచేత తిట్లు తినే ఓ కుర్రాడిగా కనిపించబోతున్నానని రాజ్ తరుణ్ వెల్లడించారు.
Also Read: Bison OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ధృవ్ విక్రమ్ బైసన్!