E-Paper
Advertisement

UP Crime: భర్తని ఇరికించిన భార్య.. ఆ తర్వాత పోలీసోడితో రిలేషన్ షిప్‌, చివరకు శవమై

UP Crime: భర్తని ఇరికించిన భార్య.. ఆ తర్వాత పోలీసోడితో రిలేషన్ షిప్‌, చివరకు శవమై
Advertisement

UP Crime: తన కోపమే తన శత్రువు. ఏదైనా పని చేసేముందు ఒక్క క్షణం ఆలోచించి చేయమంటారు పెద్దలు. అందులో మంచి- చెడు రెండూ కనిపిస్తాయి. ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందు తప్పవు. అంతేకాదు ఆ లోకాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యూపీలోని ఓ మహిళకు అదే జరిగింది. భర్తపై కోపంతో కేసు పెట్టింది. ఆ తర్వాత ఓ పోలీసు అధికారితో ఎఫైర్ పెట్టుకుంది. ప్రాణం మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది.

యూపీలో దారుణమైన ఘటన

Advertisement

యూపీలోని హమీర్‌పూర్‌ ప్రాంతంలో ఓ మహిళ నగ్నంగా ఉన్న మృతదేహం కనిపించింది. అది చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుతో సంబంధమున్న మహోబా జిల్లాలోని కబ్రాయ్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ని అరెస్టు చేశారు. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

పోలీసుల కథనం ప్రకారం.. మహోబా జిల్లాలోని కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్ బహదూర్ కూతురు కిరణ్ దేవి.. వినోద్ సింగ్‌ను వివాహం చేసుకుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు వినోద్‌సింగ్. భార్యాభర్తలు మొదట్లో బాగానే ఉండేవారు. ఆ తర్వాత విబేధాలు పొడచూపాయి.

Advertisement

భర్తని అడ్డంగా ఇరికించి.. ఓ పోలీసోడితో రిలేషన్‌షిప్‌

చివరకు భర్త, అత్తమామలపై వరకట్న వేధింపులు, గృహ హింస కింద పోలీసులకు ఫిర్యాదులు చేసింది భార్య కిరణ్.  ఈ కేసును ఇన్‌స్పెక్టర్ అంకిత్ యాదవ్ విచారణ చేస్తున్నాడు. విచారణ సమయంలో కిరణ్‌తో రిలేషన్ షిప్ పెట్టుకున్నాడు ఎస్ఐ. ఆ తర్వాత ఇద్దరి మధ్య శారీరక సంబంధంగా మారింది.  నవంబర్ 12న అంకిత్ యాదవ్.. తన స్నేహితుడితోపాటు కిరణ్‌ను కారులో హమీర్‌పూర్‌ తీసుకెళ్లాడు.

అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. పట్టరాని కోపంతో మహిళపై ఇనుప రాడ్‌తో దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పొలంలో పడేసి వెళ్లిపోయాడు. మహిళ డెడ్ బాడీ ప్రాంతంలో లభించిన ఆనవాళ్లు ప్రకారం ఈ ఘటన వెనుక ఎస్ఐ ఉన్నాడని నిర్ధారించుకున్నారు.  నిందితుడు ఉపయోగించిన కారు, హత్యకు ఉపయోగించిన అనుమానిత ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ: మా కుటుంబం నుంచి 18 మంది వెళ్లారు.. బతికున్నారో చనిపోయారో తెలీదు

చివరకు నిందితుడు ఎస్ఐ అని తేలడంతో అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుడ్ని కస్టడీని తీసుకుని విచారించనున్నారు పోలీసులు. మరి పోలీసుల విచారణలో కొత్త విషయాలు ఏమైనా బయటపడతాయా? ఆమె హత్యలో తన ప్రమేయం లేదని తప్పించుకుంటాడా? అనేది చూడాలి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×