E-Paper
Advertisement

Congress: తెలంగాణలో ఓట్ చోరీ జరిగింది.. రేపటి నుంచే సంతకాల సేకరణ చేపడుతాం: టీపీసీసీ అధ్యక్షుడు

Congress: తెలంగాణలో ఓట్ చోరీ జరిగింది.. రేపటి నుంచే సంతకాల సేకరణ చేపడుతాం: టీపీసీసీ అధ్యక్షుడు
Advertisement

Congress: ఓట్ చోరికి వ్యతిరేకంగా గాంధీ భవన్ లో తెలంగాణ యువజన కాంగ్రెస్ మహా నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ భాను చిబ్ ,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్,రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి ,ఇతర ముఖ్య నేతలు,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ,యూత్ కాంగ్రెస్ సభ్యులు లు హాజరయ్యారు.

సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి యూత్ కాంగ్రెస్ నివాళులు తెలిపింది. ఓట్ చోరికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ సభ్యుల నినాదాల అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఓట్ చోరి ఏ విధంగా జరుగుతుందో రాహుల్ గాంధీ గారు నిరూపించారని చెప్పారు. ఎన్నికల కమిషన్ దానిని ఎందుకు చూపెట్టలేకపోయిందని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా ఓట్లు తొలగించి చోరికి పాల్పడుతోందని పొన్నం ఆరోపించారు.

Advertisement

‘‘దేశ వ్యాప్తంగా ఓట్ చోరీ పై ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమంలో దీర్ఘకాలిక పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసిన వారసత్వం ఉన్న పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలుపుతుంది. తెలంగాణ యూత్ కాంగ్రెస్ సైనికులుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి శక్తివంతంగా పని చేయాలి. దేశ వ్యాప్తంగా ఓట్ చోరి నిరసనలు ఉదృతం చేయాలి. ఇది మన బాధ్యత .. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ విధానాలు ఇంటింటికి తీసుకోపోవాలి. ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అనేక రకాలుగా ఆరోపణలు చేసిన మన పై నమ్మకంతో గెలిపించారు. ప్రజల విశ్వాసాన్ని నమ్మకం తో గెలిచాం.’’ అని అన్నారు.

సౌదీ అరేబియా బస్సు ప్రమాదం లో 42 మంది మృతి చెందారని,  అందులో 16 మంది హైదరాబాద్ వారు ఉన్నారని మంత్రి పొన్నం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని, ఎన్నారై అడ్వైజరీ కమిటీ వినోద్ ఆ చర్యల్లో ఉందని చెప్పారు. వారి మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం అన్నారు.

Advertisement

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఓట్ హక్కు ప్రతి పౌరుడు రాజ్యాంగ హక్కు. అది చోర్ అవుతుందని, సర్(SIR) పేరిట బీహార్ లో ఓట్ల తొలగింపు జరిగిందని ఆరోపించారు. రాజ్యాంగ బద్దంగా, న్యాయ బద్దంగా ఎన్నికలు జరిగి ఉంటే మహా గడ్ బంధన్ కు 200 సీట్లు వచ్చేవన్నారు. ఓట్ చోరీ ద్వారా ఎన్నికలు జరిగితే దేశ భవిష్యత్, ప్రజా స్వామ్యానికి నష్టం జరుగుతుందని చెప్పారు. ‘‘సర్ తెలంగాణ కు కూడా వస్తుంది. అందరూ అప్రమతంగా ఉండాలి. ఎన్నికల కమిషన్ అంటే ఒకప్పుడు శేషన్ గుర్తుకు వచ్చేది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ బీజేపీ అనుబంధ సంఘం లాగా పని చేస్తుంది. ఒక వ్యక్తి కోసమో తాత్కాలిక లబ్ది కోసమో ఇలా ఓట్ చోరీ చేస్తే దేశానికి చాలా నష్టం జరుగుతుంది. మోడీకి అధికారమే పరమావధిగా పని చేస్తున్నారు. హర్యానా, మహారాష్ట్ర, బీహార్ లలో ఇలా ఓట్ చోరీ తోనే గెలిచారు.’’ అని అన్నారు.

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లు నిజాయితీగా పని చేస్తున్నారని మహేష్ కుమార్ అన్నారు. వారు పదవులను త్యాగం చేస్తే.. మోదీ పదవుల కోసం అన్ని రకాల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో తెలంగాణ లో కూడా ఓట్ చోరీ జరిగిందన్నారు. మోదీ 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న కూడా సామాన్యులకు ఓరిగిందేమిలేదని అన్నారు. ‘‘బీహార్ లో అత్యంత వెనుకబడిన కూడా మళ్లీ నితీష్ కు ఎందుకు ఓటు వేస్తారు. వారు కేవలం ఒక్క అక్రమాల ఆధారంగా అధికారంలోకి వచ్చారు.  యువత ఈ విషయాలను అర్థం చేసుకొని ఓట్ వేసేందుకు ముందుకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజలు ఓట్ చోరీ జరిగింది అని నమ్ముతున్నారు. రేపటి నుంచి తెలంగాణ లో ముమ్మరంగా వోట్ చోరీ పై సంతకాల సేకరణ చేపడుతాం. యూత్ కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినదిస్తున్న.. అధ్యక్షులు శివచరణ్ రెడ్డి ని అభినదిస్తున్న.’’ అని టీపీసీసీ చీఫ్ అన్నారు.

Read Also: Saudi Arabia Bus Incident: ‘మా కుటుంబం నుంచి 18 మంది వెళ్లారు.. బతికున్నారో, చనిపోయారో తెలియడం లేదు’

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×