E-Paper
Advertisement

I Bomma Ravi Father: ఆ నిర్మాతను ఎన్కౌంటర్ చేసి పడేయ్యాలి.. ఐబొమ్మ రవి తండ్రి సంచలన వ్యాఖ్యలు

I Bomma Ravi Father: ఆ నిర్మాతను ఎన్కౌంటర్ చేసి పడేయ్యాలి.. ఐబొమ్మ రవి తండ్రి సంచలన వ్యాఖ్యలు

I Bomma Ravi Father: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఐ బొమ్మ రవి(IBomma Ravi) గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈయన సినిమాలను పైరసీ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి తనని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవి చంచల్ గూడ జైలులో ఉన్నారు. 14 రోజులపాటు కోర్టు ఈయనకు రిమాండ్ విధించడంతో ఈయన రిమాండ్ ఖైదీ ఉన్నారు. అలాగే పోలీసులు కూడా రిమాండ్ లో ఉన్న రవిని విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో భాగంగా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ దిశగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

కళ్యాణ్.సి ను ఎన్కౌంటర్ చేయాలి..

ఇక రవి అరెస్టు కావడంతో తన తండ్రి అప్పారావు (Apparao)మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అయితే ఈయన తన కొడుకు చేసిన పని తప్పేనని తెలిపారు. తన కొడుకు హైదరాబాదులో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారనే విషయం మాత్రమే తనకు తెలుసని ఇలాంటి పని చేస్తున్నారని తెలియదు అంటూ అప్పారావు తెలియజేశారు. ఇక రవి అరెస్టు కావడంతో ఎంతో మంది దర్శక నిర్మాతలు రవి అరెస్టు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే నిర్మాత కళ్యాణ్ .సి సైతం రవి అరెస్టు గురించి మాట్లాడుతూ సినిమాలను పైరసీలకు పాల్పడుతున్న ఇలాంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేసి పడేయాలి అంటూ ఆవేశంగా మాట్లాడారు. నిర్మాతలు కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు చేస్తే పైరసీ చేసి పెద్ద ఎత్తున నష్టాలు తీసుకువస్తున్నారంటూ మండిపడ్డారు.

కోట్లు ఖర్చుపెట్టి సినిమా ఎవడు చేయమన్నాడు?

ఈ విధంగా నిర్మాత కళ్యాణ్. సి రవిని ఎన్కౌంటర్ చేసేయాలి అంటూ చేసిన వ్యాఖ్యలపై రవి తండ్రి అప్పారావు ఘాటుగా స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిర్మాత కళ్యాణ్ వ్యాఖ్యలపట్ల అప్పారావు మాట్లాడుతూ తన వ్యాఖ్యలను తప్పుపట్టారు. నిర్మాత కళ్యాణ్ ను ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశాను ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెరిగాయి. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు? నా కొడుకు తరఫున వాదించే న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేసి తన కొడుకుకి అండగా ఉంటానని ఈయన తెలిపారు.

రవికి భారీ మద్దతు..

ఇటీవల కాలంలో సినిమా చేయడం కంటే కూడా మిగిలిన వాటికి అధికంగా ఖర్చులు చేస్తూ కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాపై పెట్టుబడి పెడుతున్నారు. ఈ భారం అంతా టికెట్ల రూపంలో ప్రజలపైనే పడుతోందని అందుకే రవి లాంటి వాళ్లు పైరసీలకు పాల్పడుతున్నారనే వాదన కూడా బయటకు వచ్చింది. అయితే రవి అరెస్టు కావడంతో ఇండస్ట్రీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం భారీగా మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. ఇక రవి కేసును వాదించడం కోసం సలీం అనే లాయర్ ముందుకు వచ్చారు ఫ్రీగా రవికి కేసు వాదిస్తానని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.

A,so Read: Sobhita: నాగచైతన్య బర్త్ డే.. శోభిత క్యూట్ విషెస్.. లవర్ అంటూ!

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×