E-Paper
Advertisement

IBomma Ravi As Police : ఐబొమ్మ రవికి పోలీస్ జాబ్.. ఆయన రియాక్షన్ ఏంటంటే?

IBomma Ravi As Police : ఐబొమ్మ రవికి పోలీస్ జాబ్.. ఆయన రియాక్షన్ ఏంటంటే?
Advertisement

IBomma Ravi As Police : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనంగా మారిన కేసు ఐబొమ్మ రవి అరెస్ట్.. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన రోజే ఫుల్ క్లారిటీ తో ఆన్లైన్లో లీక్ చేస్తూన్నాడు. దీంతో నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించాడు. గత కొన్ని ఏళ్లుగా ఈ ఐబొమ్మ ద్వారా ఎన్నో సినిమాలు పైరసీ అయ్యాయి.. రిలీజ్ అయిన రోజే HD ప్రింట్ తో ఇక్కడ సినిమాలు రిలీజ్ అవ్వడంతో అభిమానులు థియేటర్లకు వెళ్లకుండా ఫోన్లోనే చూసి ఎంజాయ్ చేసేవారు.. ఈ విషయం కాస్త నిర్మాతల దృష్టికి వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అతని గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ఇండియాలో అడుగు పెట్టగానే అరెస్టు చేశారు.. గత రెండు వారాలుగా ఐబొమ్మ రవిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అయితే తాజాగా ఐబొమ్మ రవి గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అతన్ని విచారించిన పోలీసులు.. ఒక మంచి పోలీస్ జాబ్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. మంచి జీతం కూడా ఇస్తామని అన్నారట. కానీ అతని రియాక్షన్ వేరేలా ఉందని సమాచారం. అసలు పోలీసుల ఆఫర్ కు అతని సమాధానం ఏంటి..? అతని కోరికలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

పోలీసుల ఆఫర్ కు ఐబొమ్మ రవి రియాక్షన్..

సినిమాలను పైరసీ చేస్తూ జనాలకు ఫ్రీగా సినిమాలను చూపించడం వల్ల కోట్లు సంపాదించాడు ఐబొమ్మ రవి.. అతనిని ఎంతో చాకచక్యంగా అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు గత రెండు వారాలుగా విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఎన్నో కీలక అంశాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే రెండు దఫాలుగా రవిని అటు పోలీసులు, ఇటు సిఐడి కూడా విచారించారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో ఐబొమ్మ రవి వ్యవహరించిన తీరు పోలీసు అధికారుల్లోనూ చర్చగా మారింది.. టెక్నాలజీ మీద అతనికి ఉన్న పట్టు, తెలివితేటలను పోలీసులకు క్రిమినల్స్ పట్టుకోవడంలో సహాయం చేస్తూ ఉండేలా పోలీస్ జాబ్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారట.. అందుకు బదులుగా చిరునవ్వుతో సదరు ఆఫర్ ను రిజెక్టు చేసిన ఐబొమ్మ రవి తన ప్యూచర్ ప్లాన్ గురించి ఊహించని సమాధానం చెప్పాడు.. ప్రస్తుతం ఈ న్యూస్ బయటకు రావడంతో హాట్ టాపిక్ గా మారింది..

Advertisement

Also Read : ఫైనలిస్ట్ కోసం కంటెస్టెంట్స్ పోటీ.. సుమన్, తనూజ మధ్య పోటీ..గెలిచేది ఎవరు..?

ఐబొమ్మ రవి కోరికతో పోలీసులకు షాక్.. 

పోలీస్ జాబ్ ఆఫర్ ను రవి రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.. తాను ఎవరి దగ్గర పని చేయాలని అనుకోవట్లేదు అని చెప్పాడు. తనకు నచ్చిన వ్యాపకంలో పని చేయాలన్నది తన ఆలోచనగా రవి చెప్పినట్లు సమాచారం.. అంతేకాదు.. కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ పెడతానని చెప్పినట్లు తెలుస్తుంది.. దానికి ఏం పేరు పెడతావని అడగ్గా.. ఐబొమ్మ రెస్టారెంట్ అని చెప్పినట్లు టాక్. అక్కడ సక్సెస్ అయ్యాక పలు బ్రాంచ్ లు ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నాడట.. అంతేకాదు భారత వంటకాలను ఆయా దేశాల ప్రజలకు అలవాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. 80 లక్షలు పెట్టి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్న ఐబొమ్మ రవి. తను సంపాదించిన దాంట్లో 17 కోట్ల డబ్బులను విలాసాలకే ఖర్చు చేసినట్లు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.. ఏది ఏమైనా కూడా అతని ఆలోచన బాగుంది అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది..

Advertisement

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×