Ibomma Reacts on Ravi Arrest: ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వహకుడు ఇమ్మడి రవి అరెస్టుపై తొలిసారి సదరు వెబ్ సైట్ స్పందించింది. ఇమ్మడి రవి అరెస్టుతో మన దేశంలో సేవలను నిలిపివేయడంపై సదరు వెబ్ సైట్ క్షమాపణలు కోరింది. కాగా ఇమ్మడి రవి అరెస్టుతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను పైరసీ చేసి సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఈ పైరసీ ముఠాపై పోలీసు శాఖ ఎంతోకాలంగా నిఘా పెట్టింది.
కానీ, ఇప్పటి వరకు ఈ పైరసీ దందాను అరికట్టలేకపోయింది. ముఖ్యంగా కొన్నేళ్లు ఐబొమ్మ పేరుతో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను పైరసీ చేసి సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. అయితే వెబ్ సైట్ నిర్వహకులపై ఎన్ని చర్యలు చేసుకున్నప్పటి దీనిని పూర్తి నివారించలేకపోయారు. విదేశాల్లో ఉండి ఈ వెబ్ సైట్ ని నిర్వహిస్తున్న ఇమ్మడి రవి ఇటీవల ఇండియాకు వచ్చినట్టు గుర్తించిన పోలీసులు అతడిపై నిఘా పెట్టి ఇటీవల అరెస్టు చేశారు.
అతడి అరెస్టు తో ఐబొమ్మ వెబ్ సైట్ శాశ్వతంగా షట్ డౌన్ చేశారు. ఇమ్మడి రవి అరెస్టు తర్వాత తొలిసారి సదరు వెబ్ సైట్ స్పందించింది. ఈ మేరకు ఓ కీలక మెసేజ్ ఇచ్చింది. ‘మీరు ఇటీవలే మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా సేవలకు విశ్వసనీయ అభిమానంగా మీరున్నారు. ఇకనుంచి మా సేవలను మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేస్తున్నామని తెలియజేయడానికి మేం చిందిస్తున్నాము. మీమ్మల్ని నిరాశ పరిచినందుకు మేము క్షమాపణలు కోరుతున్నాం’ అని ఐబొమ్మ సైట్లో పోస్టు చేశారు. దీంతో రవి అరెస్టుతో భారత్ లో ఐబొమ్మ సేవలు శాశ్వాతంగా ముగిసినట్టేనని స్పష్టమైంది.
Also Read: Meera Vasudevan: మూడో భర్తకు కూడా విడాకులు.. ఏడాది తిరక్కుండానే మళ్లీ సింగిలైన హీరోయిన్
ఇమ్మడి రవి అరెస్టుతో టాలీవుడ్ సినీ పరిశ్రమ మొత్తం సీపీ సజ్జనార్ కు కృతజ్ఞతలు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అక్కినేని, నిర్మాతలు డి సురేష్ బాబు, దిల్ రాజు, డైరెక్టర్ రాజమౌళి సీపీ సజ్జనార్ ని స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో ఎంతోకాళం సినీ పరిశ్రమను పీడిస్తున్న పైరసీ ముఠాని పట్టుకున్న సీపీ సజ్జనార్ తెగువను కొనియాడారు. ఎట్టకేలకు ఎంతో శ్రమించి సినీ పైరసీ పట్టుకున్న టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రేక్షకులు కూడా పైరసీని ప్రోత్సహించవద్దని, సినిమా తమదని ప్రతి ఒక్కరు భావించాలని చిరంజీవి అన్నారు.