E-Paper
Advertisement

తెలంగాణ పెళ్లిళ్లంటే మందు సీసాలేనా? ‘గడప’ పాటపై రచ్చ!

తెలంగాణ పెళ్లిళ్లంటే మందు సీసాలేనా? ‘గడప’ పాటపై రచ్చ!
Advertisement

 Idhupu Kayitham Gadapa Song Controversy:ప్రియదర్శి,నాగ దుర్గ జంటగా వంశీ కృష్ణ దొండపాటి దర్శకత్వంలో ఇడుపు కాయితం అనే సినిమా వస్తున్న సంగతి తెల్సిందే.ఇక బన్నీ వాసు,సుకుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడు డిసెంబర్ 11న థియేటర్ లోకి వచ్చేందుకు సిద్దమవుతుంది కూడా .

అందులో భాగంగానే తాజాగా గడప అనే సాంగ్ ని రిలీజ్ చేసింది మూవీ టీమ్.ఈ పాటలో పెళ్లి అయిన తర్వాత కొత్తకోడలు అత్తగారింటికి వచ్చే సమయంలో ఆ పెళ్లి కూతురు ఎలా ఎమోషనల్ అవుతుందన్న కాన్సెప్ట్ తో సాంగ్ డిజైన్ చేశారు. అంతా బాగానే ఉంది కాని ఈ సాంగ్ లోని ఒక షాట్ లో అభినవ్ రెండు మందు సీసాలని వాటర్ క్యాన్ లలో పోసి అందరికి గ్లాస్ లలో పోయడం కనిపిస్తుంది.ఇదిగో ఇదే ఇపుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది.

Advertisement

అసలు తెలంగాణ అంటే కేవలం మందు అని,ఎక్కువ తాగుతారనే బ్రమలో ఎందుకు ఉంటారో అర్థం కావట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పెళ్లి అనగానే మందుని నీళ్ళలో పోసి అందరికి పంచడం అనేది ఎక్కడా ఉండదని ,కేవలం రాత్రి పూట ఇష్టం ఉన్న వారు తాగుతారు తప్ప ,పట్టపగలే తెలంగాణా వాళ్ళని ఒక తాగుబోతుల్లాగా చూపించడం ఏమీ బాగోలేదంటూ ఏకి పారేస్తున్నారు.

తెలంగాణా కల్చర్ అంటే కేవలం తాగుడు మాత్రమే కాదని,అంతకి మించిన అనుబంధాలు, ఆప్యాయతలు, సంస్కృతి,సంప్రాదాయాలు ఎన్నో ఉంటాయని ,కానీ కేవలం తాగుడు అనే దానినే గ్లోరిఫై చేయడం ఏమీ బాగోలేదని కౌంటర్లు వదులుతున్నారు.ఇక ఈ సినిమా దర్శకుడు కూడా తెలంగాణా వాడై ఇలా పట్టపగలే మందుని పదిమందికి పంచుతారంటూ చూపించడం బాధాకరం అంటూ వాపోతున్నారు.

Advertisement

ముఖ్యంగా దర్శకుడికి తెలంగాణా ని,కల్చర్ ని,ట్రెడిషన్ ని చూపించాలనుకుంటే బతుకమ్మ,భోనం,పోతురాజు,యక్షగానాలు ..ఇలా ఎన్నో ఉన్నాయని కానీ వాటిపై ఫోకస్ పెట్టకుండా కేవలం ఒక మందు పైనే దృష్టి పెట్టడం ఏమీ బాగోలేదని మండిపడుతున్నారు.మేకర్స్ కి తెలంగాణ అంటే తాగడం,ఆంద్రా అంటే తినడం అని చూపించడం ఒక ఫ్యాషన్ గా మారిపోయిందని,అయినా ఏదో ఒక ప్రాంతంలో జరిగితే అది మొత్తం ఒక రాష్ట్రంలో జరిగే ఆచారంగా చిత్రీకరించడం ఏమీ బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తెలంగాణా అంటే ఇంత పచ్చని పల్లెలు ఉంటాయని తాను అనుకోలేదని,ఈ సినిమా షూటింగ్ సందర్భంగా వెళ్ళిన నాకు అలా పచ్చని వాతావరణం చూసి షాక్ అయ్యానని చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.తెలంగాణా అంటేనే వ్యవసాయం,అలాంటిది నేల మొత్తం ఎండిబారిపోయి ఉంటాయని ఎలా అనుకున్నారని,అయినా తెలంగాణా పట్ల ఇంత చిన్న చూపు ఉండటం ఏం బాగోలేదంటూ చెడుగుడు ఆడేస్తున్నారు.

ఏది ఏమైనా ఇడుపు కాయితం అని టైటిల్ పెట్టినప్పుడు సోషల్ మీడియాలో ఎలా రెండు ప్రాంతాల వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని వార్తల్లో నిలిచారో,ఇపుడు మరోసారి తెలంగాణా కల్చర్ అంటే పగటి పూట మందు అంటూ చిత్రీకరించడంతో అలాగే మరోసారి మీడియాలో నిలిచి ట్రోలింగ్ కి గురవుతుంది.చూడాలి మరి ఒకవైపు భారీ అంచనాలని మోస్తూనే మరో వైపు విమర్శకులకి గురవుతున్న ఈ సినిమా ఈ ఏడు డిసెంబర్ 11న ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !

ALSO READ :‘గాజుల గల గల’ సింగర్‌కు ఏమైంది? సోషల్ మీడియాలో ఎందుకీ ట్రోలింగ్?

Tags

Related News

గాడ్ ఆఫ్ వార్ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్ కూడా ఓకే చేశారా?

మళ్లీ వచ్చేస్తున్న బర్నింగ్ స్టార్.. రీ రిలీజ్ కి సిద్ధమైన కొబ్బరిమట్ట.. ఎప్పుడంటే?

100 కోట్ల విలువైన ఇంటిని నిర్మించిన కమెడియన్.. ఇల్లు చూస్తే మతి పోవాల్సిందే!

వయసు మారితే బాడీ లాంగ్వేజ్ కూడా మారాల్సిందే – రాగ్ మయూర్!

‘ఫౌజీ’లో నేతాజీగా కనిపించిన ఈ నటుడు ఎవరో తెలుసా?

టైగర్ ష్రాఫ్ పై దాడి వెనుక బయటపడ్డ అసలు నిజం!

‘రామాయణ’ మూవీ రన్ టైం.. డైరెక్టర్ ప్లాన్ ఇదేనా..?

Big Stories

Advertisement
×